సగం మెదడుతో బతుకుతుండు

సగం మెదడుతో బతుకుతుండు

ఒక కాలో, చెయ్యో లేకపోయినా.. బతకొచ్చు. మరి మెదడు లేకపోతే.. అవును రష్యాలో ఒక వ్యక్తికి సగం మెదడు మాత్రమే ఉంది. ఆయన వయసు అరవై ఏళ్లు. ఆయనో ఇంజినీర్‌‌‌‌. అసలు మెదడు లేకుండా ఎలా బతికాడు. అసలు
మెదడు లేదని ఎలా తెలిసింది?

అరవై ఏళ్లు పై బడిన ఒక వ్యక్తి కొన్ని రోజుల క్రితం మాస్కోలోని ఒక ఆస్పత్రిలో చేరాడు. ‘ఒక కాలు, ఒక చెయ్యి కదపలేకపోతున్నా’ అని డాక్టర్లతో చెప్పాడు. దాంతో వాళ్లు అన్ని టెస్ట్‌‌లు చేశారు. కారణం బ్రెయిన్‌‌లో ఇస్కిమిక్‌‌ అటాక్‌‌(మెదడులో కొంత భాగానికి రక్త ప్రసరణ నిలిచిపోవడం) అని నిర్ధారించారు. అందుకే మెదడు స్కానింగ్‌‌ కూడా తీశారు. కానీ.. వచ్చిన రిపోర్ట్‌‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విషయం ఏంటంటే.. స్కానింగ్‌‌ కాపీలో దెబ్బతిన్నదని భావించిన మెదడు ఎడమ వైపు భాగంలో నల్లని ఖాళీ ప్లేస్‌‌ కనిపించింది. అంటే ఆయన మెదడులో సగభాగం మాత్రమే ఉంది. దానివల్ల అతడికి ఏదైనా సమస్య వచ్చిందేమోనని పరీక్షించగా.. అతడికి మెదడు సగం లేకపోవడం వల్ల ఏ సమస్య రాలేదని తెలిసింది.  ఆయన ఒక ఇంజినీర్‌‌‌‌. చిన్నప్పటి నుంచి ఆయనకు మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యలే రాలేదు. అయితే, ఆయనను పరిశీలించిన న్యూరాలజిస్ట్‌‌ మరినా అనికినా పుట్టడమే సగం మెదడుతో పుట్టి ఉంటాడని చెప్పాడు. అయితే ఆ ఇంజినీర్‌‌‌‌ మాత్రం తన ఐడెంటిటీనీ రివీల్‌‌ చేయడానికి, ఆయన సమస్యపై
మరిన్ని టెస్ట్‌‌లు చేయడానికి ఒప్పుకోలేదు.