పెద్దపల్లిలో వంశీకృష్ణ​కే మాదిగల సపోర్ట్

పెద్దపల్లిలో వంశీకృష్ణ​కే మాదిగల సపోర్ట్

ముషీరాబాద్, వెలుగు: పెద్దపల్లి లోక్ సభ కాంగ్రెస్  ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకే తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి మద్దతు ఉంటుందని చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాదిగ స్పష్టం చేశారు. శనివారం చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మద్దతు తెలిపి మాట్లాడారు. 

గత పదేండ్లుగా మాదిగలను వంచించిన బీఆర్ఎస్ ను ఓడించి దళితుల పక్షపాతి అయిన కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని కోరారు. మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణను 100 రోజుల్లో చేస్తామని చెప్పి.. పదేండ్లుగా బీజేపీ మోసం చేస్తూ వచ్చిందని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఆ పార్టీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించి పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.