ఒకే వ్యక్తి ఏడాదిలో లక్ష విలువైన కండోమ్స్ ఆర్డర్..స్విగ్గీ ఇన్‌‌స్టామార్ట్ లో రికార్డ్

ఒకే వ్యక్తి  ఏడాదిలో  లక్ష విలువైన  కండోమ్స్ ఆర్డర్..స్విగ్గీ ఇన్‌‌స్టామార్ట్ లో రికార్డ్
  •     ఆర్డర్ చేసిన చెన్నైకి చెందిన ఓ వ్యక్తి 
  •     స్విగ్గీ ఇన్‌‌స్టామార్ట్ 2025 నివేదిక వెల్లడి  
  •     ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ప్యాక్!
  •     సెప్టెంబర్‌‌లో 24% పెరిగిన కండోమ్ ఆర్డర్లు
  •      రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య  పీక్ టైమ్
  •     టాప్ గిఫ్ట్ డేస్‌‌గా నిలిచిన రక్షా బంధన్, ఫ్రెండ్‌‌షిప్ డే

చెన్నై: ప్రముఖ క్విక్ కామర్స్  ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ స్విగ్గీ ఇన్‌‌‌‌‌‌‌‌స్టామార్ట్ తన 2025 వార్షిక నివేదిక ‘హౌ ఇండియా ఇన్‌‌‌‌‌‌‌‌స్టామార్టెడ్ 2025’ను సోమవారం విడుదల చేసింది. ఈ నివేదికలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. చెన్నైకి చెందిన ఓ యూజర్ ఈ ఏడాదంతా కేవలం కండోమ్‌‌‌‌‌‌‌‌ల కోసమే  రూ.1,06,398 ఖర్చు పెట్టినట్లు నివేదిక స్పష్టం చేసింది. అతను మొత్తం 228 సార్లు కండోమ్‌‌‌‌‌‌‌‌లను స్విగ్గీ ఇన్‌‌‌‌‌‌‌‌స్టామార్ట్​లో ఆర్డర్ పెట్టాడు. అంటే నెలకు సగటున 19 ఆర్డర్లు చేసినట్లు నివేదిక పేర్కొంది. స్విగ్గీ ఇన్‌‌‌‌‌‌‌‌స్టామార్ట్​లోని ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ప్యాకెట్టేనని చెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కండోమ్ ఆర్డర్లు 24 శాతం పెరిగాయని.. రాత్రి 10 నుంచి-11 గంటల మధ్యే ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయని వివరించింది. కాగా.. చెన్నైవ్యక్తిని ఉద్దేశించి స్విగ్గీ స్పందించింది. ఈ వ్యక్తి ఒక్కసారే పెద్ద మొత్తంలో కండోమ్స్ కొని ఇంట్లో స్టాక్ పెట్టుకోకుండా ఏడాది పొడవునా ప్లాన్ ప్రకారం ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ సరదాగా కామెంట్ చేసింది. ఎప్పుడూ లాస్ట్ మినిట్ రిస్క్ తీసుకోకూడదని ఫన్నీగా స్పందించింది.

రిపోర్టులో ఇతర ఆసక్తికర విషయాలివే..

ఇతర ఆసక్తికర ఆర్డర్ల గురించి కూడా  స్విగ్గీ నివేదిక వెల్లడించింది.  ముంబైలోని ఓ యూజర్ షుగర్ ఫ్రీ రెడ్ బుల్ కోసం రూ.16.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపింది. చెన్నైలోని మరో కస్టమర్ తన పెంపుడు జంతువుల సామగ్రి కోసమే రూ.2.41 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పింది. నివేదిక ప్రకారం.. నోయిడాలో ఒకరు బ్లూటూత్ స్పీకర్లు, ఎస్ఎస్డీలు, రోబోటిక్ వాక్యూమ్‌‌‌‌‌‌‌‌ల కోసం ఒకేసారి రూ.2.69 లక్షలు ఖర్చు చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మరో  వినియోగదారుడు ఒకే ట్యాప్‌‌‌‌‌‌‌‌లో మూడు ఐఫోన్ 17ల కోసం రూ.4.3 లక్షలు వెచ్చించాడు. ఈ ఏడాది ప్రేమికుల రోజున  నిమిషానికి 666  గులాబీల ఆర్డర్లు జరిగినట్లు నివేదిక వివరించింది. రక్షా బంధన్, ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌షిప్ డే, వాలెంటైన్స్ డే 2025లో ఎక్కువ గిఫ్ట్ డేస్​గా మారినట్లు పేర్కొంది. బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ స్విగ్గీ డెలివరీ పర్సన్​కు రూ.68,600 టిప్స్ చెల్లించగా..చెన్నైకి చెందిన మరో వ్యక్తి రూ.59,505 టిప్స్‌‌‌‌‌‌‌‌తో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు.