గెలిచే ఇండిపెండెంట్లకు మస్తు గిరాకీ

గెలిచే ఇండిపెండెంట్లకు మస్తు గిరాకీ
  • ప్రధాన పార్టీలకు మెజార్టీ రానిచోట వాళ్లే కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు
  • ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల క్యాండిడేట్ల చుట్టూ ప్రధాన పార్టీల నేతల చక్కర్లు
  • తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు
  • బరిలో 3,749 మంది ఇండిపెండెంట్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పష్టమైన మెజారిటీ రాకుంటే ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల క్యాండిడేట్లు కీలకం కానున్నారు. రాష్ట్రంలోని అనేక చోట్ల త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో వీరికి బాగా డిమాండ్ ఉంది. గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల క్యాండిడేట్లపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. గెలిస్తే తమకే మద్దతివ్వాలంటూ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా డబ్బులు కానీ, పదవులు కానీ ఇస్తామని ఆఫర్​ చేస్తున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మున్సిపల్​ చైర్​పర్సన్​ పదవులు కూడా ఇచ్చేందుకు కొన్ని పార్టీల నేతలు ఓకే అంటున్నట్లు సమాచారం.

టఫ్​ ఫైట్​లో వాళ్లే కీలకం

రాష్ట్రంలో 120మున్సిపాలిటీలు,  9 కార్పొరేషన్లకు బుధవారం ఎన్నికలు జరిగాయి. వీటిలో అనేక చోట్ల గెలుపు కోసం టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ పోటీ పడ్డాయి. మున్సిపాలిటీలో చైర్​పర్సన్​ ఎన్నికకు ప్రధాన పార్టీలకు కనీస సీట్లు రాని సందర్భంలో ఇండిపెండెంట్లు కింగ్​లు, కింగ్​ మేకర్లు కానున్నారు. ఒక మున్సిపాలిటీలో 10 సీట్లుంటే.. ఒక ప్రధాన పార్టీకి నాలుగు సీట్లు, మరో ప్రధాన పార్టీ నాలుగు సీట్లు.. ఇతరులు రెండు సీట్లు గెలుచుకుంటే ఇతరులే కీలకం అవుతారు. ఇలా టఫ్​ ఫైట్​ ఉన్న ప్రాంతాలను గుర్తించిన ప్రధాన పార్టీల నేతలు అక్కడి ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల క్యాండిడేట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

3,749 మంది ఇండిపెండెంట్లు

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 12,898 మంది పోటీ చేశారు. ఇందులో 3,749 మంది ఇండిపెండెట్లుగా బరిలో దిగారు. పార్టీల నుంచి టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశించి దక్కకపోవడంతో అనేక మంది రెబల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. ఎక్కువగా టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రెబల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరిలో ఉన్నారు. వీరికి స్థానికంగా పట్టు, బలం ఉండటంతో ప్రధాన పార్టీలకు గట్టి పోటీని ఇచ్చారు. అత్యధికంగా జనగాంలో 54, రామగుండంలో 44 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. వీరిలో గెలిచే వాళ్లు కూడా ఉన్నారని ప్రధాన పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు.

ఇప్పటి నుంచే లైన్ల పెడ్తున్నరు

మున్సిపోల్​ ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. చిన్నపార్టీల క్యాండిడేట్లను, ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీల లీడర్లు మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కొన్ని పార్టీలు అంతర్గంగా సర్వేలు చేయించుకున్నాయి. ఎవరు గెలుస్తారో లెక్కలు వేసుకుంటున్నాయి. ఒకవేళ తమకు స్పష్టమైన మెజార్టీ రాకపోతే ఇండిపెండెంట్లతో మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చైర్​పర్సన్ స్థానాలను కైవసం చేసుకోవచ్చని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. గెలిచే అవకాశం ఉన్న వారి చుట్టూ కొందరు నేతలు చక్కర్లు కొడుతున్నారు. వాళ్లకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు.  డబ్బులు, పదవులు ఇస్తామని ఆశచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్​పర్సన్​, డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాన్స్​ఇస్తామని, తప్పనిసరి పరిస్థితులు వస్తే చైర్​పర్సన్​ పదవి కూడా ఇచ్చేందుకు వెనుకాడబోమని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీకి పీఠం దక్కకూడదన్న ఆలోచనతో ఇలా పార్టీలు పోటా పోటీ వ్యూహాలు రచిస్తున్నాయి.

Independent and minority candidates will be crucial in municipalities and corporations