న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న మనవాళ్లను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రారంభించిన వందేభారత్ మిషన్ సెకండ్ ఫేజ్ మే 16నుంచి 22వరకు జరుగుతుంది. 31 దేశాలలోని ఇండియన్స్‌ను 149 ఫ్లైట్లలో తీసుకొచ్చేందుకు ప్లాన్చేస్తున్నామని ఎయిర్ఇండియా అధికారులు తెలిపారు. 12 దేశాల నుంచి 64 ఫ్లైట్స్‌లో సుమారు 15,000 మందిని మనదేశానికి మొదటి ఫేజ్‌లో తీసుకొస్తున్నారు. మే 7న ప్రారంభమైన ఫస్ట్‌ఫేజ్14వ తేదీతో ముగుస్తుంది. ‘సెకండ్‌ఫేజ్‌లో ఎయిర్ఇండియా, ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్149 ఫ్లైట్లను ఆపరేట్చేస్తాయి. యూఎస్ఏ, యూఏఈ, కెనడా, సౌదీ అరేబియా, యూకే, మలేషియా, ఒమన్, కజక్‌స్థాన్, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్, ఖతార్, ఇండోనేషియా, రష్యా, ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్, సింగపూర్, ఐర్లాండ్, కిర్గిస్థాన్, కువైత్, జపాన్, జార్జియా, జర్మనీ, తజికిస్థాన్, బహ్రెయిన్, అర్మేనియా, థాయ్‌లాండ్, ఇటలీ, నేపాల్, బెలారస్, నైజీరియా, బంగ్లాదేశ్ దేశాలలో చిక్కుకున్న మనవాళ్లను తీసుకొస్తాం’ అని అధికారులు చెప్పారు.

