కివీస్ తో తొలి టెస్ట్.. శ్రేయాస్ అయ్యర్ కు ఆరంగేట్రం

కివీస్ తో తొలి టెస్ట్.. శ్రేయాస్ అయ్యర్ కు ఆరంగేట్రం

నేటి నుంచి కివీస్ టీమిండియా తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం అయ్యింది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఇవాల్టి మ్యాచ్ తో టెస్టుల్లో ఎంట్రీ ఇస్తున్నారు. లెజండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ .. శ్రేయస్ అయ్యార్ కు క్యాప్ అందించి టెస్ట్ టీంలోకి ఆహ్వానించాడు.  

కాన్పూర్‌‌‌‌‌‌‌‌: టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ను వైట్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌ చేసిన టీమిండియా.. వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌ను మరిపించింది. ఇప్పుడు అదే న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో ఇండియా టెస్టు సవాల్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయింది. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ గురువారం స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అవుతోంది.  రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కోహ్లీతో పాటు స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌, కే ఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌, పంత్‌‌‌‌‌‌‌‌, షమీ, బుమ్రా లేకుండా సెకండ్ స్ట్రింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌తో ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో టాప్​ ర్యాంకర్​ కివీస్‌‌‌‌‌‌‌‌ను ఢీకొడుతోంది. ఇండియా సెకండ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పటికీ స్టార్లు లేకపోవడంతో హోమ్‌‌‌‌‌‌‌‌టీమ్‌‌‌‌‌‌‌‌ కాస్త  వీక్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తోంది. ఇదే అదనుగా సిరీస్‌‌‌‌‌‌‌‌ నెగ్గి టీ20ల్లో ఓటమికి రివెంజ్‌‌‌‌‌‌‌‌ తీర్చుకోవాలని కివీస్‌‌‌‌‌‌‌‌ భావిస్తోంది. అయితే, ఎప్పట్లానే హోమ్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో స్పిన్‌‌‌‌‌‌‌‌ వికెట్లపై అపోజిట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను చుట్టేయాలని స్టాండిన్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ అజింక్యా రహానె నాయకత్వంలోని ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ ఆశిస్తున్నారు. కీలక ప్లేయర్లు లేని ఇండియా.. కివీస్‌‌‌‌‌‌‌‌ టెస్టు సవాల్​లో పాసైతుందో లేదో చూడాలి. 

రహానెపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ 
ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్న రహానెపై అందరి ఫోకస్‌‌‌‌‌‌‌‌ ఉండనుంది. ఎందుకంటే తను ఫామ్‌‌‌‌‌‌‌‌లో లేడు. టెస్టుల్లో అతని యావరేజ్‌‌‌‌‌‌‌‌ 40 కిందికి పడిపోయింది. వరుస ఫెయిల్యూర్స్‌‌‌‌‌‌‌‌తో విమర్శలు ఎదుర్కొంటున్న రహానెకు  ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ అతి పెద్ద సవాల్‌‌‌‌‌‌‌‌ కానుంది. ఇందులో ఫెయిలైతే టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లో తను  ప్లేస్‌‌‌‌‌‌‌‌ కోల్పేయే ప్రమాదం ఉంది. గత ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లోనూ ఫెయిలైన రహానె కివీస్‌‌‌‌‌‌‌‌పై సత్తా చాటి ఫామ్‌‌‌‌‌‌‌‌ అందుకోవాలని చూస్తున్నాడు. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌తో పోటీ ఎక్కువైన నేపథ్యంలో  తన ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించి టీమ్‌‌‌‌‌‌‌‌ను ముందుండి నడిపించాలని అంతా ఆశిస్తున్నారు. రహానెతో పాటు స్టాండిన్‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ పుజారా కూడా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ బరువు మోయనున్నాడు. మూడేళ్లుగా సెంచరీ కొట్టని పుజారా ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో అయినా ఆ కరువు తీర్చుకుంటాడో చూడాలి. హిట్‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ పెయిర్‌‌‌‌‌‌‌‌  రోహిత్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో  మయాంక్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయడం ఖాయమే. ఇక, అనూహ్యంగా టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌ నుంచి పిలుపు అందుకున్న  శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో టెస్టు డెబ్యూ చేయబోతున్నాడు. తను మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లోనే బరిలోకి దిగొచ్చు. స్పిన్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌పై సీనియర్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్లు అశ్విన్‌‌‌‌‌‌‌‌, జడేజా కీలకం కానున్నారు. మూడో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌తో ఆడాలనుకుంటే అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వస్తాడు.  ఈ ముగ్గురూ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ కూడా చేయగలగడం ఇండియాకు ప్లస్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌. పేస్‌‌‌‌‌‌‌‌ కోటాలో ఉమేశ్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌కు తోడు  ఇషాంత్‌‌‌‌‌‌‌‌ శర్మ, సిరాజ్‌‌‌‌‌‌‌‌లో ఒకరు బరిలోకి దిగనున్నారు. ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌ దృష్ట్యా లంబూకే చాన్స్‌‌‌‌‌‌‌‌ రావొచ్చు.  ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో దూసుకొస్తున్న యంగ్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌  సిరాజ్‌‌‌‌‌‌‌‌ నుంచి టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లో తన ప్లేస్‌‌‌‌‌‌‌‌కు  ముప్పు లేకుండా చూస్కోవాలంటే కివీస్‌‌‌‌‌‌‌‌పై లంబూ సత్తా చాటాల్సిందే.

న్యూజిలాండ్​ పక్కాగా..
ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ పక్కా ప్లాన్‌‌‌‌‌‌‌‌తో ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అయింది. టెస్టు స్పెషలిస్టులైన రాస్‌‌‌‌‌‌‌‌ టేలర్, లాథమ్‌‌‌‌‌‌‌‌, జెమీసన్‌‌‌‌‌‌‌‌, అజాజ్‌‌‌‌‌‌‌‌ తదితరులు ముందుగానే ఇండియా వచ్చి ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ చేశారు. టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండి కెప్టెన్‌‌‌‌‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ సైతం టెస్టులపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. పైగా, ఈ ఏడాది వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూటీసీ) నెగ్గిన కివీస్‌‌‌‌‌‌‌‌ జోరు మీదుంది. ఇండియాలోనూ సిరీస్‌‌‌‌‌‌‌‌ గెలిచి తమది ఆల్–కండిషన్స్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ అనిపించుకోవాలని చూస్తోంది. ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ ఆ టీమ్‌‌‌‌‌‌‌‌కు బ్యాక్‌‌‌‌‌‌‌‌బోన్‌‌‌‌‌‌‌‌ కాగా.. సీనియర్‌‌‌‌‌‌‌‌ టేలర్‌‌‌‌‌‌‌‌తో పాటు లాథమ్‌‌‌‌‌‌‌‌, నికోల్స్‌‌‌‌‌‌‌‌..  అశ్విన్‌‌‌‌‌‌‌‌–జడేజా స్పిన్‌‌‌‌‌‌‌‌ సవాల్‌‌‌‌‌‌‌‌ను ఎలా ఎదుర్కొంటారన్నదానిపై ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ విజయావకాశాలు ఉంటాయి. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ ట్రెంట్‌‌‌‌‌‌‌‌ బౌల్ట్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌  గ్రాండ్‌‌‌‌‌‌‌‌హోమ్‌‌‌‌‌‌‌‌ ఆడటం లేదు. దాంతో, టిమ్‌‌‌‌‌‌‌‌ సౌథీ, నీల్‌‌‌‌‌‌‌‌ వాగ్నర్‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు తీసుకోనున్నారు. కివీస్‌‌‌‌‌‌‌‌ కూడా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే చాన్సుంది. అజాజ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, శాంట్నర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆఫ్ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ విలియమ్‌‌‌‌‌‌‌‌ సోమర్‌‌‌‌‌‌‌‌విల్లేతో ఇండియాను సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌ చేయాలని చూస్తోంది. 

పిచ్‌‌‌‌‌‌‌‌ ఎట్లుందంటే..
కాన్పూర్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌ స్పిన్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వనుంది. రెండో రోజు నుంచి టర్న్​ రానుంది. 2016లో  న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో ఇక్కడ ఆడిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అశ్విన్‌‌‌‌‌‌‌‌, జడేజా 16 వికెట్లు పడ గొట్టారు. కాబట్టి రెండు జట్లూ ముగ్గురేసి స్పిన్నర్లతో ఆడొచ్చు. 
టీమ్స్‌‌‌‌‌‌‌‌ ఇట్లుండొచ్చు
ఇండియా: మయాంక్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌, పుజారా, అజింక్యా రహానె (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, జడేజా, సాహా (కీపర్‌‌‌‌‌‌‌‌), అశ్విన్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌/సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌, ఇషాంత్‌‌‌‌‌‌‌‌, ఉమేశ్‌‌‌‌‌‌‌‌/సిరాజ్‌‌‌‌‌‌‌‌. 
న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌: లాథమ్‌‌‌‌‌‌‌‌, విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌, విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్), టేలర్‌‌‌‌‌‌‌‌, నికోల్స్‌‌‌‌‌‌‌‌, బ్లండెల్‌‌‌‌‌‌‌‌ (కీపర్‌‌‌‌‌‌‌‌), శాంట్నర్‌‌‌‌‌‌‌‌/జెమీసన్‌‌‌‌‌‌‌‌, సౌథీ, వాగ్నర్‌‌‌‌‌‌‌‌, సోమర్‌‌‌‌‌‌‌‌విల్లే, అజాజ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌.