ఆఫీస్ కిరాయిలో కిరికిరి..ఆస్ట్రియాలోని ఇండియన్ అంబాసిడర్ రేణుపాల్ పై వేటు

ఆఫీస్ కిరాయిలో కిరికిరి..ఆస్ట్రియాలోని ఇండియన్ అంబాసిడర్  రేణుపాల్ పై వేటు

న్యూఢిల్లీ: ప్రభుత్వ నిధులను మిస్​యూజ్ చేసినట్లు తేలడంతో ఆస్ట్రియాలోని ఇండియన్ ఎంబాసిడర్​ రేణు పాల్​పై ఎక్స్​టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చర్యలు తీసుకుంది. ఆమెను ఢిల్లీలోని విదేశాంగశాఖ హెడ్​ఆఫీస్​కు ట్రాన్స్‌ ఫర్ చేస్తూ.. అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ పవర్స్ పై ఆంక్షలు విధించింది. పర్మిషన్ లేకుండా ఆస్ట్రియాలో గవర్నమెంట్ రెసిడెన్సీ కోసం కోట్లాది రూపాయలను ఖర్చుచేసినట్లు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు  తెలిపాయి.

ఫేక్ సర్టిఫికెట్లతో వ్యాట్ రికవరీ

ఆస్ట్రియాలో ఇండియన్ అంబాసిడర్ గా పనిచేస్తున్న 1988 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ రేణు పాల్ ప్రభుత్వ నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో చీఫ్​ విజిలెన్స్ ఆఫీసర్ ఆధ్వర్యంలోని ఓ బృందం గత సెప్టెంబర్ లో ఆస్ట్రియాలో దర్యాప్తు జరిపి, రిపోర్టును సీవీసీకి అందజేసింది. మినిస్ట్రీ పర్మిషన్ ఉన్నట్లు ఫేక్ పేపర్లు చూపించి పెద్దమొత్తంలో వ్యాట్ రీఫండ్ చేసుకున్నారని, అనుమతులు లేకుండానే ప్రభుత్వ రెసిడెన్సీ రెంట్​కు నెలకు రూ.15 లక్షలు చొప్పున ఖర్చు చేశారని రిపోర్టులో వెల్లడైంది. దీంతో మరో నెలలో రిటైర్ కానున్న రేణుపాల్​ను ఢిల్లీకి రావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.