5రూపాయల మెడిసిన్ తో కరోనా కు చెక్ : ఐసీఎంఆర్ కు ప్రపోజల్

5రూపాయల మెడిసిన్ తో కరోనా కు చెక్ : ఐసీఎంఆర్ కు ప్రపోజల్

ఐదురూపాయల గోళీతో కరోనా ను అరికట్టవచ్చని సైంటిస్ట్ లు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పై వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు సైంటిస్ట్ లు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు వ్యాధుల్ని నయం చేసే మెడిసిన్ పై ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధిస్తున్నారు. మొన్నటి వరకు మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్  ను  కరోనా బాధితుల పై ప్రయోగించారు. ప్రయోగాలు కొంతమేర మంచి ఫలితాల్ని ఇచ్చినప్పటికి గుండెజబ్బులు, కంటి సంబంధిత సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ ఓ  ఆ డ్రగ్ ను వినియోగాన్ని నిలిపివేసింది.

తాజాగా చెన్నైకి చెందిన కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ రాజన్ రవిచంద్రన్ ఐసీఎం ఆర్ తో పాటు ప్రపంచంలో ఉన్న మిగిలిన మెడిసిన్ కౌన్సిల్లకు ఓ ప్రోపజల్ పంపిచారంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది.  అర్థరైటిస్ చికిత్స కు వాడే ఇండో మెథాసిన్ కరోనా బాధితుల్ని దెబ్బతీసే సైటోకిన్ అనే ప్రమాదకర ప్రొటీన్ ను అడ్డుకోగలదని, పరిశోధనలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు.

ప్రస్తుతం సైటోకిన్ ప్రొటీన్ ను అడ్డుకునేందుకు వినియోగించే మెడిసిన్ డోసు ఖరీదు 60వేలు ఉందని, కానీ ఇండో మెథాసిన్ ఖరీదు కేవలం రూ.5ననే అన్నారు. డాక్టర్ రాజన్ కు పరిశోధనలకు ఊతం ఇచ్చే బ్రిటన్ కు చెందిన డాక్టర్ జనాదన్ లిబోవోజ్ సైతం సైకోటిన్ ను నాశనం చేసేందుకు ఇండోమెథాసిన్ పనిచేస్తుందని, దీనివల్ల ఖర్చు భారీగా తగ్గిపోతుందన్నారు.

డాక్టర్ రాజన్ ప్రపోజల్ పై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ బార్గవ్ మాట్లాడుతూ కరోనా వైరస్ కు చెక్ పెట్టేలా డ్రగ్స్ పై పరిశోధనలకోసం ఇప్పటి వరకు తమని 185 మంది సంప్రదించారని, కానీ తమకు కావాల్సింది ఒక్కరేనని ..దీనిపై పూర్తిస్థాయిలో చర్చలు జరిపిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు.