25 ఏండ్లకే ఎంపీగా పోటీ.. ఈ ఎన్నికల్లో అతిచిన్న వయసు అభ్యర్థి

25 ఏండ్లకే ఎంపీగా పోటీ.. ఈ ఎన్నికల్లో అతిచిన్న వయసు అభ్యర్థి

పట్నా: ఈ లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే అతిచిన్న వయసు ఎంపీ అభ్యర్థిగా శాంభవి చౌధరి  బరిలో నిలిచారు. 25 ఏండ్ల శాంభవి బిహార్ లోని సమస్తిపూర్‌‌ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) తరఫున పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తనకు ఆశీస్సులు అందజేశారని ఆదివారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

‘‘శనివారం దర్భంగా ర్యాలీలో ప్రధాని ఆశీస్సులకు నేను పొంగిపోయాను. ఇది దళితులు, మహిళలపై ఆయనకు ఉన్న గౌరవాన్ని తెలియజేసింది.శంలోనే అతిచిన్న వయసులో ఎంపీగా పోటీ చేస్తున్న నా కూతురును ఆశీర్వదించి, గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు”అని శాంభవి పేర్కొన్నారు. కాగా, శాంభవి చౌధరి మాజీ ఐపీఎస్‌ అధికారి ఆచార్య కునాల్‌ కుమారుడు సాయన్ కునాల్‌ను వివాహం చేసుకున్నారు.