తప్పు చేస్తే బెత్తంతో బడితే పూజ

తప్పు చేస్తే బెత్తంతో బడితే పూజ

ఇండొనేసియాలో లేడీ ఫ్లాగర్స్

ఆమె ఓ మహిళ. తప్పు చేసింది. దొరికిపోయింది. ఆమెకు శిక్ష వేయాలి. మనమంటామె బడిత పూజ.. అదే. ఇండొనేసియాలో అలాంటి శిక్షలే వేస్తారు. శిక్ష అమలు చేసేవాళ్లను ఫ్లాగర్స్​ అంటారు. ఇప్పటిదాకా మగాళ్లు మాత్రమే ఫ్లాగర్స్​గా ఉండేవాళ్లు. కానీ, తొలిసారిగా 8 మంది మహిళలతో ఓ ఫ్లాగర్​ స్క్వాడ్​ను ఏర్పాటు చేసింది ఇండొనేసియా. అచే ప్రావిన్స్ రాజధాని బండా అచేలో జరిగిందిది.  ఆ టీంలోని ఓ మహిళా ఫ్లాగర్​, హోటల్​లో పురుషుడితో కలిసి ఉన్న పెళ్లి కాని ఓ మహిళకు శిక్ష అమలు చేసి, ఫస్ట్​ లేడీ ఫ్లాగర్​గా రికార్డ్​ కొట్టేసింది. అయితే, ఫ్లాగర్ల పేర్లు, వివరాలను పూర్తి రహస్యంగా ఉంచుతారు. శిక్ష అమలు చేసేటప్పుడు ముఖం కూడా కనిపించకుండా బ్రౌన్ డ్రెస్, ముసుగుతో ఉంటారు. ఇలా బడితె పూజలే కాదు.. రాళ్లతో కొట్టడం వంటి శిక్షలూ ఉన్నాయి. చాలా మంది ఈ అవమానాలు భరించలేక వేరే చోటకు వెళ్లిపోతున్నారట. అయితే ఇండోనేసియాలో ఒక్క ఈ ప్రావిన్స్ లో మాత్రమే షరియా చట్టం అమలవుతోంది.