ఆలుగడ్డ తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు

ఆలుగడ్డ తినడం వల్ల  బోలెడు ప్రయోజనాలు

బరువు తగ్గడానికి ఒకటో రెండో కాదు వందల్లో డైట్​ ప్లాన్స్​ వచ్చాయి. కానీ, వాటిల్లో ఎంత వెతికినా చాలావరకు ఆలుగడ్డలు కనిపించవు. కారణం అవి తింటే బరువు పెరుగుతారని. అయితే ఇదంతా  అపోహ అంటున్నారు డాక్టర్​ సిద్ధాంత్​ భార్గవ. అంతేకాదు ఏదైనా ఒక వెజిటబుల్ లేదా మరేదైనా పదార్థం తినడం వల్ల బరువు పెరగడం, తగ్గడం ఉండదు అనేది ఆయన వాదన. 

ఆలుగడ్డని కూరగా తింటే ప్రాబ్లం లేదు. కానీ, ఫ్రెంచ్​ ఫ్రైస్​, బర్గర్​గా తింటే కచ్చితంగా బరువు పెరుగుతారనే మాటలు అక్కడా ఇక్కడా వినే ఉంటాం. అవి కూడా అపోహలే.  ఆలుగడ్డలో కార్బో హైడ్రేట్స్, గ్లైసెమిక్​ ఇండెక్స్​ ఎక్కువగా ఉండే మాట నిజమే అయినా.. వీటిని మోడర్న్​​ పద్ధతిలో తింటే బరువుకొచ్చిన ఢోకా ఏం లేదు. పైగా బోలెడు లాభాలున్నాయి అంటున్నారు ఈ డాక్టర్​. అవేంటంటే...

  • ఆలుగడ్డలో రెసిస్టెంట్​ స్టార్చ్​ అనే ఫైబర్ ఉంటుంది. ఇది ప్రో బయోటిక్​గా పనిచేసి, మలబద్ధకం, ఇరిటబుల్​ బౌల్ సిండ్రోమ్​లని దరిచేరనివ్వదు. 
  • ఆలుగడ్డలోని యాంటీ ఆక్సిడెంట్స్​.. ఫ్రీ రాడికల్స్​తో పోరాడి సెల్స్​ డ్యామేజ్​ని తగ్గిస్తాయి.
  • శరీరానికి సరిపడా పొటాషియం అందకపోతే .. సోడియం లెవల్స్​ పడిపోతాయి..దానివల్ల బ్లడ్​ ప్రెజర్​ లెవల్స్ బాగా తగ్గుతాయి. అలాంటప్పుడు పొటాషియం ఎక్కువగా ఉండే ఆలుగడ్డలు తింటే  బ్లడ్​ ప్రెజర్​ అదుపులో ఉంటుంది.
  • ఆలుగడ్డలోని ఆల్ఫా లిపోయిక్​ యాసిడ్​ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వీటిల్లోని జింక్, ఫాస్పరస్,  విటమిన్– బి , బి6 బ్రెయిన్​ ఫంక్షనింగ్​కి సాయపడతాయి. 
  • నిద్రకి ప్రేరేపించే ట్రిప్టోఫాన్​  అనే అమైనో యాసిడ్​ ఉంటుంది ఆలుగడ్డలో.  దీనివల్ల కంటినిండా నిద్రపోవచ్చు. 
  • ఆలుగడ్డ ప్రి– మెనుస్ట్రువల్ సిండ్రోమ్​ నుంచి బయటపడేస్తుందని చాలా స్టడీల్లో తేలింది. వీటిల్లోని కార్బ్స్​  శరీరంలో ట్రిప్టోఫాన్  లెవల్స్​ని పెంచుతాయి. అది సెరటోనిన్​ అనే హ్యాపీ హార్మోన్​ని రిలీజ్ చేసి ప్రి– మెనుస్ట్రువల్ యాంగ్జైటీ, ఒత్తిడిలను తగ్గిస్తుంది. 
  • ఆలుగడ్డలోని ఐరన్​, క్యాల్షియం ఎముకలకి బలాన్నిస్తాయి. అంతేకాదు ఆలుగడ్డ అందాన్ని కూడా కాపాడుతుంది. ఆలుగడ్డ జ్యూస్ లేదా ముక్కలతో ముఖాన్ని మసాజ్​ చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయి.