ఆ జెండాను ప్రదర్శించడం ముమ్మాటికీ తప్పే

ఆ జెండాను ప్రదర్శించడం ముమ్మాటికీ తప్పే

ఘజియాబాద్: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొందరు ఆందోళనకారులు ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండాను ఎగరేయడం వివాదాస్పదంగా మారింది. రీసెంట్‌‌గా పంజాబ్‌‌లోని లుధియానాలో రైతుల నిరసనలకు మద్దతుగా శనివారం చేపట్టిన ఛక్కా జామ్ అనే కార్యక్రమంలో దివంగత ఖలిస్థాన్ నేత జర్నైల్ సింగ్ బింద్రన్‌‌వాలే ఫొటోతో ఉన్న జెండాలను ప్రదర్శించారు. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత, అన్నదాతల ఆందోళనలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాకేశ్ తికాయత్ స్పందించారు. ‘స్థానికులతో మేం మాట్లాడాం. కావాలనే బింద్రన్‌‌వాలే జెండా ఎగరేస్తే మాత్రం ముమ్మాటికి తప్పే. ఆ జెండాలను బ్యాన్ చేశారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఆ జెండాలను ప్రదర్శించడం సరికాదు’ అని తికాయత్ పేర్కొన్నారు.