రూ.5 వేల నుంచి రూ.16 వేల కోట్లకు బిగ్‌‌‌‌బుల్ ఆస్తులు

రూ.5 వేల నుంచి రూ.16 వేల కోట్లకు బిగ్‌‌‌‌బుల్ ఆస్తులు

ఈక్విటీ మార్కెట్‌‌‌‌పై ఆయనకు మక్కువే కాదు నమ్మకమూ ఎక్కువే. ఓవైపు బేర్స్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ను దించేందుకు ప్రయత్నిస్తున్నా, ఏ మాత్రం తగ్గకుండా బుల్స్‌‌‌‌ను ముందుకు నడిపించడంతో బిగ్‌‌‌‌బుల్‌‌‌‌గా పేరొందారు. ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌గా, ట్రేడర్‌‌‌‌‌‌‌‌గా సక్సెస్‌‌‌‌ అయ్యారు. 35 ఏళ్ల అనుభవం సొంతం చేసుకున్న ఆయనే  రాకేష్‌‌‌‌ ఝున్‌‌‌‌ ఝున్‌‌‌‌ వాలా. మన దేశపు వారెన్‌‌‌‌ బఫెట్‌‌‌‌గా పిలుచుకునే ఆయన ఈ ఏడాది తన 60 లోకి ఎంటర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు..

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు:కేవలం రూ. ఐదు వేలతో స్టార్టయిన బిగ్‌‌ బుల్‌‌ రాకేష్‌‌ ఝున్ ఝున్ వాలా ఇన్వెస్టింగ్‌‌ కెరీర్‌‌‌‌ ఈ ఏడాదితో 35 ఏళ్లకు చేరుకుంది. 1985 లో బీఎస్‌‌ఈ సెన్సెక్స్‌‌ 150 పాయింట్లుగా ఉన్నప్పుడు ఆయన  తన మార్కెట్‌‌ కెరీర్‌‌‌‌ను  స్టార్ట్‌‌ చేశారు. 1986 లో మొదటి సారి తన బిగ్గెస్ట్‌‌ ప్రాఫిట్స్‌‌ను(రూ. 5 లక్షలు) చూసిన ఝున్‌‌ ఝున్‌‌ వాలా, 1986–89 మధ్య కాలంలో మరో రూ. 20–25 లక్షలు లాభం పొందారు.  ఒకవైపు ఇన్వెస్టర్‌‌‌‌గాను  మరోవైపు ట్రేడర్‌‌‌‌ గాను ఆయన సక్సెస్‌‌ సాధించారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 2.2 బిలియన్‌‌ డాలర్ల(రూ. 16,400 కోట్లు)కు  చేరుకుంది.  ఫోర్బ్స్‌‌ డేటా ప్రకారం ఆయన ఇండియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో 48 వ ప్లేస్‌‌లో ఉన్నారు.

ఝున్‌‌ఝున్‌‌ వాలా సక్సెస్‌‌కు కారణం..

ట్రేడింగ్‌‌, ఇన్వెస్టింగ్‌‌ రెండూ భార్య, ప్రియురాలు లాంటివని గతంలో ఝున్‌‌ఝున్‌‌ వాలా పోల్చారు. ఈ రెండింటిని ఒకేసారి మేనేజ్‌‌ చేయలేమని, అందుకే వీటిని వేరుగా ఉంచాలని చెప్పారు.  ట్రేడింగ్‌‌ ఎక్కువగా మొమెంటంపై ఆధారపడి ఉంటుందని, అమ్మడం–కొనడం వేగంగా జరిగిపోతాయన్నారు. అదే ఇన్వెస్టింగ్‌‌లో మొమెంటంకు వ్యతిరేకంగా వెళ్లినా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ‘ట్రేడింగ్‌‌లో రిటర్న్‌‌ ఆన్‌‌ ఈక్విటీ(ఆర్‌‌‌‌ఓఈ) ఎక్కువగా ఉంటుంది. క్యాష్‌‌ ఫ్లోలు భారీగా జరుగుతాయి. ఐ లవ్‌‌ ట్రేడింగ్‌‌. నాకే అవకాశం ఉంటే ట్రేడింగ్‌‌ ద్వారానే నా డబ్బులంతా సంపాదించేవాడిని. కానీ అది సాధ్యం కాదు. ట్రేడింగ్‌‌లో మన డబ్బులు కూడా పోతాయి’ అని అన్నారు. తను సంపాదించిన డబ్బులలో 98 శాతం వరకు బుల్‌‌గా ఉండడం వలనే సంపాదించానని గతంలో ఝున్‌‌ ఝున్‌‌ వాలా పేర్కొన్నారు. లాంగ్‌‌ టెర్మ్‌‌లో లాభాలు పొందేందుకు టెక్నికల్‌‌ స్కిల్స్‌‌ బాగా ఉపయోగపడ్డాయని  బిగ్‌‌ బుల్‌‌ చెప్పారు. ‘ఒక ఇన్వెస్టర్‌‌‌‌గా అయితే స్టాక్‌‌ ఓవర్‌‌‌‌ ప్రైస్‌‌ అవ్వగానే దానిని అమ్మేస్తాను. కానీ ఒక స్టాక్‌‌ ఓవర్‌‌ వాల్యు అయిన మరింత ఓవర్‌‌‌‌ వాల్యూ అవుతుందనే విషయాన్ని నా ట్రేడింగ్‌‌ స్కిల్సే నేర్పాయి’ అని ఝున్‌‌ ఝున్‌‌ వాలా చెబుతుంటారు.

ఇన్వెస్టర్‌‌‌‌ మైండ్‌‌, ట్రేడర్ మైండ్‌‌..

‘ఆయన ఇద్దరిలా ఉంటారు. ఒకరు ఇంట్లో ఉండే మంచి అంకుల్‌‌ కాగా, మరొకరు సూపర్‌‌‌‌ షార్ప్‌‌ బాస్‌‌. ఆయన బ్రెయిన్‌‌ కూడా రెండు కంపార్ట్‌‌మెంట్లలా విడిపోయి ఉంటుంది. ఒక పార్ట్‌‌ ఇన్వెస్టర్‌‌‌‌గా పనిచేస్తే, మరొకటి ట్రేడర్‌‌‌‌గా ఆలోచిస్తుంది.  ఇన్వెస్టర్‌‌‌‌ మైండ్‌‌ ఎప్పుడు ఆశావాద దృక్పథంతో ఉంటే, ట్రేడర్‌‌‌‌ పార్ట్‌‌ మాత్రం రియలిస్టిక్‌‌గా,  ఎప్పుడు నెంబర్లపై దృష్టి పెడుతుంది’ అని ఝున్‌‌ఝున్‌‌ వాలా మేనల్లుడు విశాల్‌‌ గుప్తా అన్నారు.

5 సక్సెస్‌‌ సూత్రాలు..

ఐదు విషయాలను పరిశీలించి తన స్టాక్స్‌‌ను ఎంపిక చేసుకుంటారు ఝున్‌‌ ఝున్‌‌వాలా. ఓర్పు, పీపుల్‌‌
(కంపెనీలోని మనుషులు), గవర్నెన్స్‌‌, తక్కువ ఖర్చు, టెక్నాలజీలను బట్టి ఆ స్టాకుకు విలువకడతానని గతంలో ఆయన పేర్కొన్నారు. అన్ని బుల్‌‌ మార్కెట్‌‌లకు మించిన బుల్‌‌ మార్కెట్‌‌ తాజాగా స్టార్ట్‌‌ అయ్యిందని ఝున్‌‌ ఝున్ వాలా ఈ ఏడాది జూన్‌‌లో పేర్కొనడం గమనార్హం.  ‘బుల్‌‌ మార్కెట్లు టెస్ట్‌‌ మ్యాచ్‌‌ లాంటివి, 50–ఓవర్‌‌‌‌ మ్యాచులు కాదు’  అని ఝున్‌‌ ఝున్ వాలా చెబుతుంటారు.

లాభాలు కురిశాయి ఇలా..

కెరీర్‌‌‌‌ స్టార్టింగ్‌‌లో చేసిన ఇన్వెస్ట్‌‌మెంట్లు ఝున్‌‌ ఝున్ వాలాకు  మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. 1998–-2015 మధ్యలో అపోలో హాస్పిటల్స్‌‌ 100 రెట్లు లాభాన్ని అందించింది. అదే విధంగా బాటా(1996-–2019) కూడా 100 రెట్లు, బెల్‌‌(1998–-2007) 90 రెట్లు లాభాన్ని ఇచ్చాయి. 2001-–2007 మధ్య కాలంలో ప్రజ్‌‌ ఇండస్ట్రీస్‌‌లోని ఆయన పెట్టుబడులు 700 రెట్లు పెరగడం విశేషం. 20‌‌‌‌02–-2020 లో ర్యాలీస్‌‌ 55 రెట్లు,  భారత్‌‌ ఎర్త్ మూవర్స్‌‌(బీఈఎంఎల్‌‌) 100 రెట్లు, లుపిన్‌‌ 160 రెట్లు, క్రిసిల్‌‌ 200 రెట్లు వరకు లాభాన్ని ఇచ్చాయి.  షిప్పింగ్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా(ఎస్‌‌సీఐ)లోని ఆయన పెట్టుబడులు 1200 శాతం పెరిగాయి. గత పదేళ్లలో ఈ సీనియర్ ఇన్వెస్టర్‌‌‌‌కు ఎస్కార్ట్స్‌‌(2013-–2020) నుంచి 20 రెట్లు లాభం వచ్చింది. టాటా కమ్యూనికేషన్స్‌‌(2010–2020) లోని ఇన్వెస్ట్‌‌మెంట్స్  200 శాతం పెరిగాయి.  అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన సంపద పెరగడానికి టైటాన్ కంపెనీలోని పెట్టుబడులే కారణం. ఈ కంపెనీ (2005–-20) 80 రెట్లు పెరిగింది. ఇందులో ఝున్‌‌ ఝున్‌‌ వాలా పెట్టుబడి విలువ ఇప్పుడు  రూ. 4,758 కోట్లు.

భారత్ బయోటెక్‌కు కోవ్యాక్సిన్ చాలెంజ్