న్యూఢిల్లీ: ఐటీ హార్డ్‌వేర్ సెక్టార్‌లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ కింద అనుమతి పొందిన కంప్యూటర్లు, సర్వర్ల తయారి కంపెనీలు ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించాయి. ‘ 27 పీఎల్‌ఐ కంపెనీల్లో 17 ఈ ఏడాది ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్పాయి. సుమారు 6–7 కంపెనీలు కిందటేడాదే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాయి.
మరో రెండు కంపెనీలు వచ్చే ఏడాది ఉత్పత్తి మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాయి’ అని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సెక్రెటరీ ఎస్ కృష్ణన్ అన్నారు. నెట్‌వెబ్ టెక్నాలజీస్ కంప్యూటింగ్ సర్వర్ల తయారీ ప్లాంట్‌ను ఫరీదాబాద్‌లో ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ కోసం అప్లయ్ చేసుకున్న డెల్, హెచ్‌పీ, ఫాక్స్‌కాన్, లెనోవో, నెట్‌వెబ్ టెక్నాలజీస్ వంటి 27 కంపెనీలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
