దళితబంధు సర్పంచ్​ ఫ్యామిలీకేనా?

దళితబంధు సర్పంచ్​ ఫ్యామిలీకేనా?

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​ మండలంలోని జూకల్ సర్పంచ్ కోడూరు నర్సమ్మ కుటుంబ సభ్యులను మాత్రమే దళితబంధు స్కీంకు ఎంపిక చేస్తే గ్రామంలోని మిగిలిన దళితుల పరిస్థితి ఏంటని ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ ప్రశ్నించారు. గ్రామంలోని కోడూరు ఇంటిపేరుతో ఉన్న ఐదుగురిని సెలెక్ట్​చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రవీణ్​ప్రెస్​నోట్​రిలీజ్​చేశారు. దళితులందరికీ పథకం అవసరం లేదా అని ప్రశ్నించారు. అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయకుండా అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే వర్తింపచేయడం కరెక్ట్​కాదన్నారు. ఆఫీసర్లు స్పందించి అసలైన లబ్ధిదారులకు మేలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. దీనిపై సర్పంచ్ నర్సమ్మను వివరణ కోరగా జూకల్​లో 300 మంది దళితులు ఉండగా వారిలో 95 శాతం కోడూరు ఇంటిపేరు గల వారే ఉన్నారని చెప్పారు. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాదని తెలిపారు. ఎంపీటీసీ ప్రవీణ్ అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు.