కొత్త సీజేఐగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే

కొత్త సీజేఐగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే

సుప్రీంకోర్టు 47 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే వచ్చె నెల (నవంబర్) 18 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహిస్తోన్న రంజన్ గొగోయ్ నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. కొత్త సీజేఐగా ఎవరు ముందు వరుసలో ఉన్నారనే చర్చ సాగుతోన్న సమయంలో.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  కొత్త చీఫ్ జస్టిస్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.  సీనియారిటీ ప్రకారం ప్రస్తుత సీజేఐ గొగోయ్ తర్వాత ఎస్‌ఏ బాబ్డే ఉండడంతో.. ఆయననే సీజేగా నియమించారు రాష్ట్రపతి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 2019 నవంబర్ 18 నుంచి 2021 ఏప్రిల్ 23 వరకూ బాబ్డే సిజేఐగా కొనసాగుతారు.

1956, ఏప్రిల్‌ 24న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన ఎస్ఏ బాబ్డే… నాగపూర్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు2000 సంవత్సరంలో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2012లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌జస్టిస్‌ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.

Justice SA Bobde appointed as the next Chief Justice of India, President Kovind signs warrant