కాళేశ్వరం’ అద్భుతం’ : రైతాంగానికి వరమన్న 15వ ఆర్థిక సంఘం సభ్యులు

కాళేశ్వరం’ అద్భుతం’ : రైతాంగానికి వరమన్న 15వ ఆర్థిక సంఘం సభ్యులు

కాళేశ్వరం ప్రా జెక్టు అద్భుతమని, రాష్ట్ర రైతాంగానికి ఇది వరమని15వ ఆర్థిక సంఘం సభ్యులు కొనియాడారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడు అశోక్‌‌‌‌ లహరి, కా ర్యదర్శి అరవింద్‌ మెహతా, జాయింట్‌‌‌‌ సెక్రటరీ డాక్టర్‌‌‌‌ రవి కోటా, అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్‌,  యాప్‌ ల ద్వారా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం తీరు, ప్రాజెక్టు‌‌‌‌ వల్ల కలిగే లాభాలను ప్రాజెక్టు‌‌‌‌ సీఈవో వెంకటేశ్వర్లు వారికి వివరించారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయని, మేడిగడ్డ బ్ యారేజీలో 18 లక్షల క్యూ బిక్‌‌‌‌‌‌‌‌ మీటర్ల కాంక్రీట్‌‌‌‌‌‌‌‌ పనులు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు 16 లక్షల క్యూబిక్‌‌‌‌‌‌‌‌ మీటర్ల పని అయిందని 85 గేట్లకు 20 గేట్ల బిగించినట్టు చెప్పారు.

రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 37.08 లక్షల ఎకరాలకు సాగు నీరందించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక సంఘం తోడ్పాటు అందించాలని ఆర్థిక సంఘం సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే .జోషి కోరారు. ఇంత పెద్ద ప్రా జెక్టును తక్కువ సమయంలో పూర్తి చేస్తుండడాన్ని చూసి ఆర్థిక సంఘం సభ్యులు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. సంఘం కా ర్యదర్శి అర్వింద్‌ మెహతా మాట్లాడుతూ.. సంవత్సరం క్రితం ఇక్కడకు వచ్చానని, ఏడాదిలో అన్నారం బ్ యారేజీ పనులు పూర్తిచేస్తామని చెప్పారన్నారు. చెప్పినట్టే చేసి చూపించారని సంతోషం వ్యక్తం చేశారు