కార్తికేయ జాఖడ్‌‌ చాలా టాలెంటెడ్‌

కార్తికేయ జాఖడ్‌‌ చాలా టాలెంటెడ్‌

స్కూల్లో అందరి పిల్లల్లా కాకుండా, కార్తికేయ జాఖడ్‌‌ చాలా టాలెంటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  ప్రతీ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చేవాడు. కొత్త విషయాల మీదున్న క్యూరియాసిటీతో, వాటిగురించి టీచర్లను అడిగి తెలుసుకునేవాడు.   ఆ క్యూరియాసిటీతోనే మూడు ఎడ్యుకేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్స్ తయారుచేశాడు.  చిన్న వయసులో యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గిన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోకి ఎక్కాడు. తన టాలెంట్‌‌ గుర్తించి హార్వర్డ్‌‌ యూనివర్సిటీ వాళ్లు స్కాలర్‌‌‌‌షిప్‌‌ అనౌన్స్‌‌ చేశారు.కరోనా కారణంగా ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జరగడం వల్ల చాలామంది పిల్లలకు సొంత మొబైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనిచ్చారు తల్లిదండ్రులు. వాటికి బాగా అలవాటుపడ్డ పిల్లలు, ఖాళీ దొరికితే చాలు మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడటమో, రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోలు చూడటమో చేస్తున్నారు. జవహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవోదయ విద్యాలయంలో ఎనిమిదో క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదువుతున్న కార్తికేయ కూడా అలా అవుతాడేమో అని భయపడ్డారు తల్లిదండ్రులు. కానీ, అతను అలా చేయలేదు. యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారుచేసి రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సృష్టించాడు.

ప్రాబ్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాల్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి..
హర్యానా, జజ్జార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు కార్తికేయ తండ్రి అజిత్ జాఖడ్. తాహతుకు మించిందైనా కొడుకు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం 10,000 రూపాయలు పెట్టి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనిచ్చాడు. దాంట్లో క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో పాటు, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోలు చూసేవాడు కార్తికేయ. ‘ఎప్పుడూ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టుకొనే ఉంటున్నాడు. ఏవేవో వీడియోలు చేస్తున్నాడు. చదువుకుంటాడనుకుంటే ఇలా అవుతున్నాడేంటి’ అని బాధపడేవాళ్లు తల్లిదండ్రులు. ఒకసారి తండ్రి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాంగ్ అవ్వడం చూసిన కార్తికేయ, తను యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా నేర్చుకున్న కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయంతో ఆ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని బాగు చేశాడు. 
యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేర్చుకున్న కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కార్తికేయ ఇప్పడు మూడు ఎడ్యుకేషనల్ యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తయారుచేశాడు. లూసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జీకే) కోసం, కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రాఫిక్ డిజైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్తిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంకొకటి శ్రీరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్తిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారుచేశాడు. లూసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఇప్పుడు పది లక్షల మందికిపైగా డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. ఈ యాప్స్ వేలాది మంది  స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు వేరేవాళ్లకు యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్ చేస్తున్నాడు. ‘అందరికీ ఉపయోగపడే యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారుచేసి, దేశానికి సేవ చేస్తా’ అంటున్న కార్తికేయకు హార్వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ వాళ్లు స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అతి చిన్న వయసులో యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నందుకు గిన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓఎంజి (ఓ మై గాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎక్కాడు కార్తికేయ.​