
మొన్నటివరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇటీవల తన కొత్త సినిమా NBK 109 సెట్ లో అడుగుపెట్టాడు. దర్శకుడు బాబీ కొల్లి(Bobby kolli) తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశి నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న. NBK 109 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేసింది. అందుకే ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాతో మరోసారి దసరా బరిలో నిలువనున్నాడు బాలయ్య. అవును బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా గతేడాది దసరా బరిలోనే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అందుకే ఈ సినిమా కూడా దసరా బరిలో దించాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. అందుకే NBK 109 సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నారట.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోసారి దసరాకి బాలయ్య మాస్ జాతర చేయడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక NBK 109 సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.