ఖాదీ బోర్డ్ చైర్మన్ కేవీ రాజేశ్వర్ రావు గుండెపోటుతో మృతి

ఖాదీ బోర్డ్ చైర్మన్ కేవీ రాజేశ్వర్ రావు గుండెపోటుతో మృతి

జగిత్యాల జిల్లా: మెట్ పల్లి ఖాదీ బోర్డ్ చైర్మన్,కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ కేవీ రాజేశ్వర్ రావు (84) బుధవారం మధ్యాహ్నం హైదరాబాదులోని తిలక్ నగర్ లో ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో కోరుట్ల నియోజకవర్గం లో విషాదఛాయలు అలుముకున్నాయి.

మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో జన్మించిన కె.వి రాజేశ్వరరావు.. మొగిలిపేట గ్రామంలో 20 సంవత్సరాలు సర్పంచ్ గా కొనసాగాడు.  దివంగత నేత ఎన్టీ రామారావు హయాంలో టిడిపి కార్యకర్త స్థాయి నుండి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఎదిగిన రాజేశ్వర్ రావు టిడిపి పార్టీలో  మెట్ పల్లి నియోజక వర్గం నుండి  టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో  2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరి 2001 లో మెట్ పల్లి జెడ్పీటీసీ గా టిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా  పదవీ బాధ్యతలు చేపట్టారు.

2006 వరకు జడ్పీ చైర్మన్ గా కొనసాగిన అనంతరం. ఖాదీ బోర్డ్ చైర్మన్ గా పదవిని స్వీకరించి. 2020 సంవత్సరం వరకు దాదాపు 12 సంవత్సరాలు ఖాదీ బోర్డు కు సేవలందించారు. చిన్నతనం నుండే రాజకీయాల్లో చురుకుగా ఉండే రాజేశ్వరరావు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తో పాటు మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కు అతి సన్నిహితంగా ఉంటూ రాజకీయంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. రాజేశ్వరరావుకు  ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఆయన మృతి పట్ల కరీంనగర్ జిల్లా లో విషాద ఛాయలు అలుముకున్నాయి.