మంచినీళ్ల కోసం అరిగోస పడ్తున్నాం.. మున్సిపాలిటీ ముందే స్నానాలు చేసి నిరసన

మంచినీళ్ల కోసం అరిగోస పడ్తున్నాం..  మున్సిపాలిటీ ముందే  స్నానాలు  చేసి నిరసన
  • సీపీఐ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో  ఖాళీ బిందెలతో ర్యాలీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో మంచినీళ్ల కోసం కష్టాలు పడుతున్నామంటూ సీపీఐ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మున్సిపల్​ ఆఫీసు ఎదుటే స్నాలు చేసి ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులతో కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఉదయం అమరవీరుల స్థూపం నుంచి మున్సిపల్​  ఆఫీస్​ వరకు ఖాళీ కుండలు, బకెట్లతో   ర్యాలీ నిర్వహించారు. మంచినీళ్ల కోసం  గోస పడ్తున్నా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, చైర్​ పర్సన్​ కె. సీతాలక్ష్మి, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఫైర్​ అయ్యారు. 

ఎండాకాలంలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చాలాసార్లు  కౌన్సిల్​ మీటింగ్ లో ఎమ్మెల్యే,   చైర్​  పర్సన్,   మున్సిపల్​ కమిషనర్​ను కోరినా  ఫలితం లేదని  మున్సిపల్​సీపీఐ ఫ్లోర్​ లీడర్​ వై. శ్రీనివాస్​రెడ్డి అన్నారు.   వారం, పదిరోజులకోసారి నీళ్ల సరఫరా జరుగుతోందన్నారు.  నిరసన చేస్తున్నవారితో డీఈ నవీన్​ కుమార్ మాట్లాడి..  నీటి సప్లై మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడంతో  ఆందోళన విరమించారు. ఈ ప్రోగ్రాంలొ సీపీఐ కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, నెరెళ్ల సమైక్య. బోయిన విజయ్​ కుమార్​, మునిగడప పద్మ, మాచర్లరాజకుమారి, నాయకులు పిడుగు శ్రీనివాస్​, మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్​  పాల్గొన్నారు.