V6 News

శ్రీకాంత్‌‌, అంజుమ్‌‌కు సీకే నాయుడు అవార్డులు

శ్రీకాంత్‌‌, అంజుమ్‌‌కు సీకే నాయుడు అవార్డులు

న్యూఢిల్లీ: ఇండియా మాజీ కెప్టెన్‌‌, 1983 వరల్డ్‌‌కప్‌‌ గెలిచిన టీమ్‌‌లో సభ్యుడైన కృష్ణమాచారి శ్రీకాంత్‌‌, మహిళల టీమ్‌‌ మాజీ కెప్టెన్‌‌ అంజుమ్‌‌ చోప్రా ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక సీకే నాయుడు లైఫ్‌‌ టైమ్‌‌ అచీవ్‌‌మెంట్‌‌ అవార్డులకు ఎంపికయ్యారు. జనవరి 12న ముంబైలో జరిగే యాన్యువల్‌‌ అవార్డు ఫంక్షన్‌‌లో వీరికి బీసీసీఐ పురస్కారాలు అందజేయనుంది. 1981-–92 మధ్య ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన క్రిష్‌‌ .. 43 టెస్టులు, 146 వన్డేలు ఆడాడు.  1989లో పాకిస్థాన్‌‌ టూర్‌‌కు వెళ్లిన జట్టుకు కెప్టెన్సీ వహించాడు 2009–12 మధ్యలో నేషనల్‌‌ సెలెక్షన్‌‌ కమిటీ చైర్మన్‌‌గానూ శ్రీకాంత్‌‌ పని చేశాడు. ఇక,2012లో ఆటకు గుడ్‌‌బై చెప్పిన 42 ఏళ్ల అంజుమ్‌‌ మహిళా క్రికెట్‌‌లో గొప్ప బ్యాటర్‌‌గా పేరు తెచ్చుకుంది. 12 టెస్ట్‌‌ల్లో 548 రన్స్‌‌తో పాటు 127 వన్డేల్లో 2856 రన్స్‌‌ చేసింది. 18 ఇంటర్నేషనల్‌‌ టీ20ల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2005 విమెన్స్‌‌ వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్‌‌ ఆడిన జట్టులో అంజుమ్‌‌ సభ్యురాలు.

Krish Srikkanth, Anjum Chopra to receive CK Nayudu Lifetime Achievement Award