రెబల్స్‌ను కాళ్లు పట్టుకోనైనా బుజ్జగించాలి : కేటీఆర్

రెబల్స్‌ను కాళ్లు పట్టుకోనైనా బుజ్జగించాలి : కేటీఆర్

2018 డిసెంబర్ లో గెలిచి.. 2019లో పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్‌గా.. మంచి వాతావరణంలో అడుగు పెట్టామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు 2020 జనవరిలో జరిగే మున్సిపల్  ఎన్నికల్లో కూడా గౌరవ ప్రదంగా మంచి ఫలితాలు సాధించి శుభారంభంతో మొదలు పెడతామన్నారు. పార్టీ లో గ్రామ, మండల కమిటీల నిర్మాణం 90 శాతం పూర్తయ్యిందని..రాబోయే 11 నెలలు.. జిల్లాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. కొత్త పుంతలు తొక్కుతున్న డిజిటల్ మీడియా, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటామని..వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు పార్టీ మధ్య అనుసంధాన కర్తగా పనిచేస్తుందని చెప్పారు.

మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలతో పోల్చితే తాము అందరికన్నా ముందున్నామని.. పార్టీ క్షేత్ర స్థాయి నివేదిక ఒకటి రెండు రోజుల్లో మాకు చేరుతాయన్నారు. మొదటి వారంలో సీఎం కేసీఆర్ తో సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ నెలాఖరు నుంచి అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తామని తెలిపిన కేటీఆర్..  సీఎం కేసీఆర్ చేతుల మీదుగానే అన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. మున్సిపల్ చట్టాన్ని పదునుగా అమలు చేయటం నేను ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యం అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ ను బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యేదే. కాళ్లు పట్టుకోవాలి.. లేదా కడుపులో తల పెట్టాలని తెలిపారు కేటీఆర్.

75 గజాల లోపు ఉంటే సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా అనుమతులు ఇస్తామని.. 75 గజాల పైన వుంటే .. 21 రోజుల్లోనే అనుమతులు ఇవ్వాలన్నారు.. ఏమైనా సమస్య వుంటే మొదటి వారం లోపే చెప్పాలన్నారు. 21 రోజుల్లో అనుమతులు రాకపోతే .. ఆటోమేటిక్ గా సదరు మున్సిపల్ కమిషనర్ సంతకంతో ఇంటికి లెటర్ వస్తందన్నారు. ఎవరైనా అలసత్వం వహిస్తే టీఆర్ఎస్ కౌన్సిలర్, కార్పొరేటర్ ., చైర్మన్ లనుంచే చర్యలు తీసుకోవటం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజల మీద విశ్వాసం పెడుతున్నామని.. సెల్ఫ్ డిక్లరేషన్ లో ఎవరైనా తప్పుడు దృవీకరణ చేస్తే 25 రెట్లు  ఫైన్ వేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారికి పార్టీలకతీతంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తామని.. చట్టంపై అవగాహన కల్పిస్తామన్నారు. పోటీ చేసే ముందు అభ్యర్థులు కొత్త చట్టం గురించి తెలుసుకుంటే మంచిదని సూచించారు.

సింహ భాగం మున్సిపల్ సీట్లు గెలుస్తాం 

2019లో ఎక్కడా ఫెయిల్యూర్ కాలేదు..  ఎంపీ ఎన్నికల్లో మేము అనుకున్నది సాధించలేదు….కానీ రెండు జాతీయ పార్టీలతో పోల్చితే మేమే నంబర్- 1. ఆర్టిసి సమ్మె జరిగింది.. అదే ఆర్టిసి కార్మికుల కేసీఆర్ కు జేజేలు పలుకుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ లో సమస్య లు వస్తాయి.. కానీ. వాటిని ఎలా పరిష్కరించాము అనేది కూడా ముఖ్యం. గవర్నర్ కూడా కాళేశ్వరం చూసి బాగుంది అని చెప్పక తప్పలేదు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. ఆయనే ముఖ్యమంత్రిగా వుంటానని చెప్పారు.. మళ్లీ ఈ చర్చకు తావు లేదు. NPR, NCR లు అమలు చేయాలా వద్దా.. అనేది ప్రభుత్వ  తీసుకునే నిర్ణయం.. పార్టీ కాదు. ఇప్పుడు ఏపీకి, మాకు మంచి సంభందాలు లేవు అని ఎవరు చెప్పారు.  చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఒక పరిణితితో వాటిని పరిష్కరించుకుంటాము. అని తెలిపారు కేటీఆర్.