నేటితో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు

నేటితో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు సీనియర్ లీడర్లు మల్లికార్జున ఖర్గే, శశిధరూర్లు మాత్రమే నామినేషన్ల దాఖలు చేశారు. ఉపసంహరణ తర్వాత బరిలో ఎవరు ఉండనున్నారనే దానిపై క్లారిటీ రానుంది. అభ్యర్థుల తుది జాబితాను జాతీయ ఎన్నికల కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్ట్రీ సాయంత్రం 5 గంటలకు ప్రకటించనున్నారు.

పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే  అక్టోబర్ 17న పోలింగ్, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. 9 వేల మందికి పైగా కాంగ్రెస్ డెలిగెట్స్ ఓటు వేయనున్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరిసారిగా నవంబర్, 2000లో ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సోనియాగాంధీ చేతిలో జితేంద్ర ప్రసాద ఓడిపోయారు.  అంతకుముందు 1997లో శరద్ పవార్,  రాజేష్ పైలట్‌లను సీతారాం కేస్రీ ఓడించారు.