హెల్మెట్ ధరించే వారికి గణపతి లడ్డూలు

హెల్మెట్ ధరించే వారికి గణపతి లడ్డూలు

దేశ వ్యాప్తంగా కొత్తగా అమలైన మోటార్ వాహన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాజ్ కోట్ పోలీసులు విన్నూత కార్యక్రమం చేపట్టారు. ఇద్దరు పోలీసుల చేత గణేశ్ అవతారం వేయించి రోడ్డుపై హెల్మెట్ పెట్టుకునే వారిని అడ్డుకుని వారికి గణపతి లడ్డూలు తినిపిస్తున్నారు. అలాగే సర్టిఫికేట్లు ఇచ్చి వారిని అభినందిస్తున్నారు పోలీసులు.

హెల్మెట్ మనిషికి ఎంతో ముఖ్యమైనదని.. ప్రజలు తప్పనిసరి హెల్మెట్ ధరించేలా తాము చూసుకుంటున్నామని రాజ్ కోట్  ఎస్పీ అజయ్ చౌదరి అన్నారు. హెల్మెట్ ధరించే వారికి గణేశ్ దేవుడి లడ్డూను అందిస్తున్నామన్నారు. వారిలో అవగాహన కల్పించేందుకు ,ట్రాఫిక్ నియమాలను పాటించటానికి ఈ కార్యక్రమం ప్రజలను ప్రేరేపిస్తుందన్నారు. బోల్బాలా అనే ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.