డ్రైవర్ కు ఫిట్స్.. మేడ్చల్ లో కంటైనర్ బీభత్సం

డ్రైవర్ కు ఫిట్స్.. మేడ్చల్ లో కంటైనర్ బీభత్సం

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై కంటైనర్ బీభత్సం సృష్టించింది. చెక్ పోస్ట్ సమీపంలోని ప్రియదర్శిని, సంతోష్ హోటల్ ముందు పార్క్ చేసిన వాహనాలను హైదరాబాద్ నుండి హరియాన వెళ్తున్న లారీ (కంటైనర్) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరుగలేదు.  హరియానాకు చెందిన లారీ హైదరాబాద్ నుండి హరియానాకు లోడ్ తో వెళ్తుంది.

మేడ్చల్ చెక్ పోస్ట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న హోటళ్ల ముందు ఆగి ఉన్న వాహనాలను అటుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా వాహనాలపై లారీ దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో జనాలు ఉండకపోవడంతో పెను ప్రమాదం తప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ కు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు మేడ్చల్ పోలీసులు.