
చిన్న వయస్సులోనే మ్యూజిక్ సంచలనంగా నిలిచిన యువ సంగీత కెరటం జీవి ప్రకాష్ కుమార్ (Gv Prakash Kumar). ఈ పేరు ఇప్పుడు భాషలు తేడాలు లేకుండా.. రాష్ట్రాల సరిహద్దులు దాటి వినిపిస్తోంది.ఇప్పుడు టాలీవుడ్ లో బెస్ట్ ఛాయిస్గా జీవి ప్రకాష్ నిలుస్తున్నాడు.
ఇతను కేవలం సంగీత దర్శకుడే కాదు..సింగర్,యాక్టర్, లిరిసిస్ట్,ప్రొడ్యూసర్..ఇలా సినిమా విభాగంలో ముల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోక తప్పదు.ఇతను ఎక్కువగా తమిళ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చిన..తెలుగులో చేసిన మూవీస్కి గుర్తిండి పోయేలా సాంగ్స్ ఇచ్చాడు.
తాజా విషయానికి వస్తే ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ గా, హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. భాష భావంతో..హిట్స్ ప్లాప్స్ తో తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కాగా గడిచిన ఈ నాలుగు నెలల గ్యాప్ లోనే హీరోగా మూడు సినిమాల్లో నటించాడు.
ప్రస్తుతం జీవీ నటించిన కాల్వన్ అనే సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 4 న థియేటర్లలో రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక థియేటర్ రన్ ముగియడంతో ఇపుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నేడు మే 14న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చిన ఈ మూవీలో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్‌గా నటించింది.ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమారే పాటలకు స్వరాలు అందించారు.రేవా బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.
Innum 3 naal #Kalvan streaming from May 14 on Disney Plus Hotstar
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) May 11, 2024
A @gvprakash Musical ?
Background Score @revaamusic @offBharathiraja @AxessFilm @Dili_AFF @pvshankar_pv @i_ivana @ActDheena @SakthiFilmFctry @Sanlokesh @ActorDev_offl @DuraiKv @dhilipaction @rahulvijai5344 pic.twitter.com/vkryDKtyAY
ఓ ఏనుగును బంధించేందుకు నలుగురు ప్రయత్నించడం, అందులో ఒకరు ఓ అమ్మాయితో ప్రేమలో పడడం చుట్టూ కల్వన్ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నా.. కథ, కథనం విషయంలో నిరాశపరిచిందనే రెస్పాన్స్ వచ్చింది.
పీవి శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన..కలెక్షన్స్ విషయంలో మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కనీసం జీవి ఫేమ్ తగ్గ ఓపెనింగ్ కలెక్షన్స్ కుదేసా వసూళ్లు చేయలేదు. మరి ఇపుడు ఓటీటీలో రిలీజై ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.