ఎం అండ్ ఎం నుంచి 16 మోడల్స్ కరెంటు బండ్లు

ఎం అండ్ ఎం నుంచి 16 మోడల్స్ కరెంటు బండ్లు
  • ఈమహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడి

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొబిలిటీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత బలోపేతం చేస్తామని ఎం అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎం ప్రకటించింది. ఇందులో భాగంగా 2027 నాటికి 16 కొత్త ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌ (ఈవీలు) మోడల్స్‌‌‌‌‌‌‌‌ను లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని వెల్లడించింది. వీటిలో లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమర్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీలు ఉంటాయి. ఈవీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచడానికి ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రత్యేకంగా ఎంటిటీగా మార్చుతారు. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు తీసుకుంటారు. ఈవీల డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం రూ.మూడు వేలు ఖర్చు చేస్తామని ఎం అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎం ఇది వరకే ప్రకటించింది. కొత్త బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో ఈవీలను లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని కంపెనీ ఈడీ రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెజూరికర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

2025–27 మధ్య నాలుగు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ ఈవీలను, ఎనిమిది ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీవీలను ఈవీలను లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని అన్నారు. గతంలోనూ పలు ఈవీ మోడల్స్​ను లాంచ్​ చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఫామ్ మెషినరీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచడానికి కూడా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను తీసుకుంటామని పేర్కొన్నారు. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి రెవెన్యూను 20 % పెంచాలనే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పనిచేస్తున్నామని, క్యూ2 తమకు రూ.21,470 కోట్ల లాభం వచ్చిందని రాజేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరించారు.