ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్..

ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్..

ఎన్నికల ప్రచారం ఈసీ నిషేధం విధించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు.  ఈసీకి సీఎం రేవంత్ రడ్డి చేసిన వ్యాఖ్యలు వినిపించలేదా అని ప్రశ్నించారు. తన పేగులు తీసి మెడలో వేసుకుంటానని.. తన గుడ్లు పీకుతానని అన్న మాటలు వినిపించలేదని అని కేసీఆర్ అన్నారు.  తనపై  48 గంటలు నిషేధం విదిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు 92 గంటలు పని చేస్తారని చెప్పారు. 

తన మాట‌ల‌ను అధికారులు స‌రిగా అర్థం చేసుకోలేదని స్థానిక మాండ‌లికాన్ని అధికారులు అర్థం చేసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ నేత‌లు కొన్ని వ్యాఖ్యల‌ను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారని తన వ్యాఖ్యల‌కు ఆంగ్ల అనువాదం స‌రికాదని అన్నారు. 

  కేసీఆర్ పై ఈసీ 48 గంట‌ల పాటు ఈసీ నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు రాత్రి 8 గంట‌ల నుంచి 48 గంట‌ల పాటు కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం విధించిన‌ట్లు ఈసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 5వ తేదీన‌ సిరిసిల్ల‌లో కాంగ్రెస్ నేత‌ల‌పై కేసీఆర్ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని కాంగ్రెస్ నేత నిరంజ‌న్ రెడ్డి ఫిర్యాదు మేర‌కు ఈసీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది.