T20 World Cup 2026: అంతా బాగుంది.. ఆ ఒక్కడికే అన్యాయం: వరల్డ్ కప్ స్క్వాడ్‌లో టీమిండియా ఓపెనర్ కు మరోసారి నిరాశ

T20 World Cup 2026: అంతా బాగుంది.. ఆ ఒక్కడికే అన్యాయం: వరల్డ్ కప్ స్క్వాడ్‌లో టీమిండియా ఓపెనర్ కు మరోసారి నిరాశ

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న 2026 టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా స్క్వాడ్ ను శనివారం (డిసెంబర్ 20) ప్రకటించారు. బీసీసీఐ ప్రకటించిన 15 మంది స్క్వాడ్ లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆశ్చర్యకరంగా గిల్ పై వేటు పడినా జైశ్వాల్ ను సెలక్టర్లు పట్టించుకోలేదు. అంతర్జాతీయ టీ20.. ఐపీఎల్ లో అద్భుతమైన రికార్డ్ ఉన్న జైశ్వాల్ ను పక్కన పెట్టడంతో మరోసారి అన్యాయం జరిగినట్టే కనిపిస్తోంది. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న ఇషాన్ కిషాన్ కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చినా జైశ్వాల్ కు మాత్రం మొండి చెయ్యి చూపించారు. 

2024 టీ20 వరల్డ్ కప్ లో జైశ్వాల్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు బ్యాకప్ ఓపెనర్ గా ఉన్నాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరు కూడా స్టార్ ప్లేయర్స్ కావడంతో జైశ్వాల్ కు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం లభించలేదు. రోహిత్, కోహ్లీ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించగానే ఓపెనర్ గా జైశ్వాల్ కు లైన్ క్లియర్ అయిందని భావించారు. అయితే అనూహ్యంగా అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ రేస్ లోకి వచ్చారు. అభిషేక్ కుదురుకోవడంతో పాటు గిల్ కు అవకాశం ఇచ్చిన జట్టు యాజమాన్యం మరోసారి ఆసియా కప్ లో జైశ్వాల్ ను బ్యాకప్ ఓపెనర్ చేశారు. ఇక ఇటీవలే ముగిసిన సౌతాఫ్రికా సిరీస్ లో ఏకంగా ఈ యువ ఓపెనర్ పై వేటు వేసిన సెలక్టర్లు.. వరల్డ్ కప్ కు ఎంపిక చేయకుండా షాక్ ఇచ్చారు.  

జైశ్వాల్ అంతర్జాతీయ టీ20 రికార్డ్ అద్భుతంగా ఉంది. 23 టీ20 మ్యాచ్ ల్లో 723 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 36 ఉండగా.. స్ట్రైక్ రేట్ 164 ఉండడం విశేషం. గిల్, కిషాన్ లాంటి ప్లేయర్లతో పోల్చుకుంటే జైశ్వాల్ కే మంచి గణాంకాలు ఉండడం విశేషం. తప్పించడానికి ఎలాంటి కారణాలు లేకపోయినా జైశ్వాల్ లాంటి అగ్రెస్సివ్ బ్యాటర్ ను పక్కనపెట్టడం అతని బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఈ స్క్వాడ్ ఓపెనర్ల అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ లు జట్టులో ఉంటారు. వీరికి బ్యాకప్ గా ఇషాన్ కిషన్ జట్టులో కొనసాగనున్నాడు. 

వరల్డ్ కప్ కు టీమిండియా స్క్వాడ్:  

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్ టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, జస్ప్రీత్ బుమ్రా