దీపావళి ఎఫెక్ట్.. డేంజర్ స్టేజ్ లో పొల్యూషన్

దీపావళి ఎఫెక్ట్.. డేంజర్ స్టేజ్ లో పొల్యూషన్

అసలే పొల్యూషన్ తో సతమతమయ్యే.. దేశ రాజధాని ఢిల్లీపై దీపావళి ఎఫెక్ట్ పడింది. పటాకులు భారీగా కాల్చడంతో గాలి కాలుష్యం ప్రమాదకరస్థాయిని దాటింది. మాల్వియా నగర్, లాజ్ పత్ నగర్, కైలాష్ హిల్స్, బురారి, జంగ్ పురా, షాహదారా, లక్ష్మి నగర్, మయూర్ విహార్, సరితా విహర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇవాళ ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్  506 పాయింట్లుగా ఉందని  ఎయిర్ కంట్రోల్ సఫర్ తెలిపింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇది 999 పాయింట్లుగా ఉంది. ఢిల్లీలో 37 వాయు నాణ్యత కేంద్రాలు ఉండగా.. వాటిలో 29 కేంద్రాల్లో  వాయు కాలుష్యం అధికంగా నమోదైంది

ఢిల్లీ శివారు ప్రాంతాలైన నోయిడా, గుర్గావ్ ఘజియాబాద్ లోనూ క్రాకర్స్ భారీగా కాల్చారు. దీంతో ఫరీదాబాద్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్  318గా ఉండగా.. గజియాబాద్ లో 397, గ్రేటర్ నోయిడాలో 315, నోయిడాలో 357 గా  ఉంది. 2018 దీపావళి తర్వాత ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్  600 మార్కును దాటింది. 2017 లో  AQI 367 గా నమోదైంది.  దీపావళి తర్వాత కాలుష్య స్థాయి పడిపోతుండటంతో 2018 లో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కలుషితమైన పటాకులను నిషేధించింది. కాలుష్య తీవ్రత తక్కువగా ఉండే  గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. అయినా ఎవరు పట్టించుకోలేదు. కాలుష్య కారక క్రాకర్స్ నే కాల్చడంతో ఢిల్లీలో ఎయిర్ కండీషన్ అధ్వాన్నంగా తయారైంది.

వాయు కాలుష్యం డేంజర్ లెవల్ కు చేరడంతో ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి ట్యాంకర్లతో నీటిని చల్లారు. రోడ్లపై నీళ్లు చల్లుతూ కాలుష్య తీవ్రత తగ్గించే ప్రయత్నం చేశారు.