సోమాజిగూడకు త్వరలో మలబార్​ గోల్డ్​ స్టోర్

సోమాజిగూడకు త్వరలో మలబార్​ గోల్డ్​ స్టోర్

హైదరాబాద్​, వెలుగు: బంగారం, వజ్రాల ఆభరణాలు అమ్మే రిటెయిల్​ చెయిన్​ మలబార్​ గోల్డ్​ సిటీలోని సోమాజిగూడలో ఈ నెల 27 న కొత్త స్టోర్​ ఓపెన్​ చేయనుంది. నగర వారసత్వాన్ని ప్రతిఫలించేలా ఈ స్టోర్​ ఉంటుందని, కస్టమర్లకు మంచి షాపింగ్​ అనుభవాన్ని ఇస్తుందని మలబార్​ గోల్డ్​ వెల్లడించింది. మొదటి ఆర్టిస్ట్రీ షోరూమ్​గా ఇది పేరొందుతుందని పేర్కొంది. కొంత మంది ఎంపిక చేసిన కస్టమర్లకు షోరూమ్​ సందర్శనకు ఈ నెల 15 నుంచే అనుమతిస్తున్నట్లు తెలిపింది. 25 వేల అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కొత్త స్టోర్​లో హస్త కళా నైపుణ్యంతో తీర్చిదిద్దిన బంగారు, వజ్రాలు, ప్లాటినం, వెండి ఆభరణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని మలబార్​ గోల్డ్​ వివరించింది. పెళ్లి కూతుళ్ల ముస్తాబుకు ప్రత్యేక ఆభరణాలు ఉంటాయని, వీఐపీ కస్టమర్ల కోసం సెపరేట్​ లాంజ్​లు ఏర్పాటు చేశామని పేర్కొంది. డిజిటల్​ స్క్రీన్లు ఉంటాయని, విశాలమైన పార్కింగ్​ సదుపాయాన్నీ అందుబాటులోకి తెస్తున్నామని మలబార్​ గోల్డ్​ వెల్లడించింది. అన్ని వర్గాల కస్టమర్ల అవసరాలను  ఈ మొదటి ఆర్టిస్ట్రీ స్టోర్​ నెరవేరుస్తుందని మలబార్​ గ్రూప్​ చైర్మన్​ ఎం పీ అహమ్మద్​ చెప్పారు. బ్రాండ్​ అంబాసిడర్​ తమన్నా భాటియాతో రూపొందించిన కొత్త టెలివిజన్​ ప్రకటనలనూ త్వరలో మలబార్​ గోల్డ్​ విడుదల చేయనుంది. హైదరాబాద్​లో గోల్డ్​ రిఫైనరీ ఏర్పాటుకు రూ. 750 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మలబార్​ గ్రూప్​ ఇప్పటికే ప్రకటించింది.