గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

రూ.18 లక్షల విలువైన 354 బాటిల్స్ సీజ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హ్యాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ సప్లయ్ చేస్తున్న ఏపీకి చెందిన వ్యక్తిని  సౌత్‌‌‌‌జోన్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌‌‌‌ఫోర్స్ అడిషనల్‌‌‌‌ డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం సర్వేపల్లికి చెందిన కొండా మిన్నారావు(22) కూరగాయలతో పాటు గంజాయిని సాగు చేస్తున్నాడు.  విజయవాడకు చెందిన అన్వర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌తో కలిసి గంజాయి సప్లయ్ చేస్తున్నాడు. పోలీసుల నిఘా పెరగడంతో గంజాయితో హాష్ ఆయిల్‌‌‌‌ తయారు చేయడం మొదలుపెట్టాడు. సిటీతో పాటు మహారాష్ట్ర, బెంగళూరుకు ట్రాన్స్‌‌‌‌ పోర్ట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా మిన్నారావు గురువారం సిటీకి వచ్చాడు. అతడి గురించి సౌత్‌‌‌‌జోన్ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులకు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. అబిడ్స్‌‌‌‌లో మిన్నారావును అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 18 లక్షల విలువైన 354 హాష్ ఆయిల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

మల్లంపేట ఓఆర్ఆర్ వద్ద మరొకరు

దుండిగల్: గంజాయి అమ్ముతున్న వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ప్రణీత్ హోమ్స్ వద్ద  మంద వీర్రాజు(22) అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని బ్యాగ్​ను తనిఖీ చేయగా.. 2.28 కిలోల గంజాయి దొరికింది. పోలీసులు దాన్ని సీజ్ చేసి నిందితుడిని రిమాండ్​కు తరలించారు.