మనోహర్ పరీకర్‌‌‌‌‌‌‌‌కు అడ్వాన్స్ డ్ స్టేజ్ లో కేన్సర్

మనోహర్ పరీకర్‌‌‌‌‌‌‌‌కు అడ్వాన్స్ డ్ స్టేజ్ లో కేన్సర్

వెలుగు: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) కేన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం జబ్బు అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉందని సీనియర్ కేబినెట్ మినిస్టర్ విజయ్ సర్దేశాయ్ ఆదివారం ప్రకటించారు. 2018 ఫిబ్రవరి నుంచి పరీకర్ ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. తొలుత ట్రీట్ మెంట్ కోసం అమెరికాకు వెళ్లొచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ లో, గోవా మెడికల్ కాలేజ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన క్లోమానికి సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నారన్న విషయం తప్ప, మిగతావేవీ బయటకు రాలేదు. పరీకర్ ను సోమవారం కలుస్తానని విజయ్ మీడియాతో చెప్పారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా , ప్రాజెక్టులను వెంటనే క్లియర్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతానన్నారు.