ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

 ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవిత   జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవితకు జ్యూడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. మే 14 వరకు జ్యూడీషియల్ కస్టడీ పొడిగించింది. వారం రోజుల్లో కవితపై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు తెలిపారు ఈడీ అధికారులు.  అంతకుముందు.. రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను హాజరుపర్చారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను కోర్టులో హాజరుపరిచాయి దర్యాప్తు సంస్థలు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరాయి ED, CBI సంస్థలు. లిక్కర్ పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును కోరారు ఈడీ, సీబీఐ అధికారులు. 

కవితకు జైలులో 10 పుస్తకాలు అనుమతించాలని కోర్టును కోరారు ఆమె తరఫు లాయర్ నితీష్ రానా. కోర్టులో కవితను 15 నిముషాల పాటు కలిసేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని విన్నవించారు. కోర్టు లాకప్ లో కవితకు తన భర్త తెచ్చిన ఆహారం తినేందుకు అనుమతించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు నితీష్ రానా. జైలులో కవితకు ఇచ్చే ఇంటి భోజనం 10, 15 మంది పోలీసులు.. చెక్ చేసి పాడు చేసిన ఆహారాన్ని అందిస్తున్నారని కోర్టుకు తెలిపారు. అలా కాకుండా డాక్టర్ జైలు అధికారి చెక్ చేసి కవితకు అందించాలని కోర్టును రిక్వెస్ట్ చేశారు లాయర్. వాదనలు విన్న జడ్జి.. ఇంటి భోజనం వద్దన్న తరువాత మళ్ళీ ఎందుకు కావాలని అడుగుతున్నారని కవితను ప్రశ్నించారు. కవితకు ఇంటి భోజనం అందించే అంశంపై జైలు సూపరింటెండెంట్ ను వివరణ కోరతామని తెలిపారు జడ్జి.