పోలీస్ జీపు అనుకొని పేల్చిన నక్సల్స్

పోలీస్ జీపు అనుకొని పేల్చిన నక్సల్స్

భద్రాచలం: పోలీస్​ జీపుగా భావించి మా వోయిస్టులు ఓ బొలేరో వాహనాన్ని పేల్చేసిన ఘటన బుధవారం రాత్రి చత్తీస్‍గఢ్లోని బీజాపూర్ ​జిల్లాలో జరిగింది. జిల్లాలోని నెమేడ్​ ఠాణా పరిధిలోని పెద్ద కోడేపాల్ వద్ద మావోయిస్టులు అంబుష్ వేసి బొలేరోను పేల్చారు. ఈ పేలుడుకు జీపు 8 అడుగుల ఎత్తు వరకు లేచి పడింది. మందుపాతర పేలుడుకు 2 మీటర్ల మేర గొయ్యి ఏర్పడింది. ఇద్దరు గర్భిణులతో సహా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని బీజాపూర్​హాస్పిటల్​కు తరలిస్తున్నట్లు ఎస్పీ గోవర్ధన్​ఠాకూర్​తెలిపారు. దంతెవాడ జిల్లాలోని కడేర్‌ లో జరిగే జాతరకు వెళ్లొస్తుండగా ఈ దురాగతానికి మావోయిస్టులు తెగబడ్డారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యం లో బలగాలను వాహనాల్లో తరలిస్తున్నారనే సమాచారంతో మావోయిస్టులు అంబుష్ వేసి మందుపాతర పేల్చారు. గాయపడిన వారిలో నలుగురిపరిస్థితి విషమంగా ఉంది.

ఎన్నికలను బహిష్కరిం చండి

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్

బూటకపు పార్లమెంట్​ఎన్ని కలను బహిష్కరించాలని సీపీఐ(మావోయిస్టు) పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్​ బుధవారం ఓ ప్రకటనలో కోరారు. అన్ని పార్టీలు సామ్రాజ్యవాద తొత్తులేనని, ప్రజావ్యతి కమైనవేనని, దోపిడీ దొంగల పార్టీలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా రు. కుంభకోణాల్లో కాంగ్రెస్‍ను బీజేపీ మించిందని పేర్కొన్నారు.

ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్

పేలుడు పదార్థాల స్వాధీనం

భద్రాచలం: దుమ్ముగూడెం మండల పరిధిలోని చిన్న నల్లబెల్లి , తాటివారిగూడెం గ్రామాల మధ్య అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులను దుమ్ముగూడెంఎస్సై బాలకృష్ణ, సీఆర్పీఎఫ్​జవాన్లు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్సై వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని చిన్న నల్లబెల్లి శివారులో తాటివారిగూడెం వెళ్లే రోడ్డులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, అదే సమయంలో టీఎస్ 280208 అనే ఆటోలో మరో నలుగురు వ్యక్తులు వచ్చిఅందరూ మాట్లాడుకుంటుండగా అటువైపు వెళ్తున్న  సీఆర్‍పీఎఫ్​జవాన్లు , పోలీసులు వారిని చుట్టుముట్టేప్రయత్నం చేశారని తెలిపారు. బలగాలను చూసి వారు పారిపోయేందుకు ప్రయత్నిం చగా వెంటాడిపట్టుకున్నట్లు తెలిపారు. విచారించగా మావోయిస్టు సానుభూతిపరులుగా తేలిందన్నారు. ఏడుగురిలో దబ్బనూతల కు చెందిన సోందె రవి, కుర్సం మురళి, తెల్లం నాగరాజు, లక్ష్మీపురానికి చెందిన ఊకం శ్రీను,చింతూరు మండలం పోతనపల్లికి చెందిన మడకం చిన్నబాబు, పాల్వంచ మండలం తోగ్గూడెం కు చెందినశివలాల్‍, ములకలపల్లి మండలం ఆనందాపురానికి చెందిన కోండ్రు జగదీశ్​ ఉన్నట్లు చెప్పారు. వీరు మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గత డిసెంబర్​లో రెండు సార్లు మావోయిస్టులకు పేలుడు పదార్థాలు చేరవేసినట్లు తమ విచారణలో వారు అంగీకరించినట్లు చెప్పారు.ఆటోలో 10 ఎక్స్ ప్లోజివ్ బూస్టర్లు , 10 ఎలక్ట్రికల్​డిటో నేటర్లు, వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.చర్ల సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోందన్నారు.