బీఆర్కే ముందు మీడియా పాయింట్..సొంతంగా ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులు

బీఆర్కే ముందు మీడియా పాయింట్..సొంతంగా ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులు

హైదరాబాద్, వెలుగు: తాత్కాలిక సెక్రటేరియెట్(బీఆర్కే భవన్) ముందు జర్నలిస్టులే సొంతంగా మీడియాపాయింట్ ఏర్పాటు చేసుకున్నారు. మీడియా పాయింట్పై ఎన్ని విజ్ఞప్తులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం బీఆర్కే భవన్ ఎదుట ఉన్న ఓ చిన్న భవనం దగ్గర సెక్రటేరియెట్ మీడియా పాయింట్ అని తెలుగు, ఇంగ్ష్లీ లో ఉన్న ఫ్లెక్సీని మీడియా ప్రతినిధులు పెట్టారు. గతేడాది ఆగస్టులో బీఆర్కే భవన్ కుసెక్రటేరియెట్ షిప్ట్అయింది. ఏడాది గడుస్తున్నా ఇంత వరకు ప్రభుత్వం మీడియా పాయింట్ పెట్టలేదు. బీఆర్కేలోకి మీడియాను సైతం అనుమతించటం లేదు. దీంతో వార్తల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఏడాది నుంచి నో ఎంట్రీ

బీఆర్కేకు సెక్రటేరియెట్ షిఫ్ట్అయిన నాటి నుంచి మీడియా ప్రతినిధులను ప్రభుత్వం లోపలికి అనుమతించలేదు. నిత్యంవివిధ పార్టీల ర్టీ నేతలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, స్టూడెంట్ యూనియన్లు, ప్రజా సంఘాలనేతలు సీఎస్, మంత్రులను కలిసేం దుకుసెక్రటేరియట్ కు వస్తుంటారు. బీఆర్కే భవన్ బయట బైక్ ల మీద మీడియా మైక్ లు ఏర్పాటు చేస్తే నేతలు మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఏడాది నుంచి బీఆర్కే భవన్ గేటు దగ్గరరిపోర్టర్లు, కెమెరామెన్లను కానిస్టేబుల్స్, హోంగార్డులు ఆపుతూ అవమానిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో,ఉద్యమ సమయంలో లేని నిషేధం ఇప్పుడు ఎందుకని మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ని వినతులు చేసినా పట్టించుకోలే..

మీడియా పాయింట్ గురించి సీఎం కేసీఆర్ కు,మంత్రి కేటీఆర్ కు పలుసార్లుమీడియా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ‘‘మీడియాను లోపలికిఅనుమతించే అంశంపై నేను అధికారులకు చెబుతాను. మీరెళ్లి కలవండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాం.ఎలాంటి అభ్యంతరం లేదు’’అని సీఎం హామీ ఇచ్చినా ఇంత వరకునెరవేరలేదు. మంత్రి కేటీఆర్ ను కూడా కలిసి మీడియా పాయింట్ పై విజ్ఞప్తి చేయగా.. అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ మూడు ప్రతిపాదనలతో మీడియా పాయింట్ కు సిఫార్సు చేశారు. అయినా ఆ సిఫార్సులు అమలుకు నోచుకోలేదని ఓ జర్నలిస్ట్ తెలిపారు.