చుండ్రుకు చెక్ పెట్టండిలా!

చుండ్రుకు చెక్ పెట్టండిలా!

జుట్టుకి సంబంధించిన అతిపెద్ద సమస్య… ‘చుండ్రు’. ఇది చాలామందిని ఇబ్బంది పెడుతుంది. చుండ్రు వల్ల దురద, జుట్టు ఊడిపోవడం… ఇంకా తీవ్రమైతే ముఖంపై మొటిమలు కూడా ఏర్పడతాయి. ఇంత తీవ్రంగా కాకముందే చుండ్రుని తగ్గించు కోవడం మంచిది. ఇందుకోసం కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే బెటర్.

బేకింగ్ సోడాని కొద్దిగా తీసుకుని తడి జుట్టుపై రాయాలి. రెండు నిమిషాల బాగా మర్దనా చేసి, ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా పదిహేను రోజులకి ఒకసారి చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గిపోతుంది. అయితే, బేకింగ్ సోడాను ఎక్కువగా వాడొద్దు.

వెనిగర్ నూ చుండ్రు సమస్యని తగ్గించు కోవచ్చు. అందుకోసం ఆరు స్పూన్ల నీళ్లలో రెండు స్పూన్ల వెనిగర్ కలపాలి. షాంపూతో తలస్నానం చేశాక, ఆ నీటితో తలని కడగాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల త్వరగా చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

పుల్లగా ఉండే పెరుగులో కొంచెం నిమ్మరసం కలిపి తలకు రాయాలి. పావుగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చుండ్రు దూరమవ్వడమే కాకుండా జుట్టు కూడా నిగనిగలాడుతుంది.