రేవంత్​.. రాజీనామా ఎప్పుడు చేస్తవ్​?  

రేవంత్​.. రాజీనామా ఎప్పుడు చేస్తవ్​?  

హైదరాబాద్, వెలుగు: రాజీనామా సవాల్​కు కట్టుబడి ఉన్నానని.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్, ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధం కావాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామాపై తాను చేసిన సవాల్ నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు. గురువారం మంత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

రేవంత్‌‌‌‌.. రాజీనామా ఎప్పుడు చేస్తవ్‌‌‌‌

రేవంత్ ఎప్పుడు రాజీనామా చేస్తే తాను అప్పుడు మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మల్కాజిగిరి నుంచి పోటీకి దిగుతానన్నారు. తాను సహనం కోల్పోయి మాట్లాడలేదన్నారు. గతంలో రేవంత్ అనేకసార్లు తనను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు.రేవంత్‌‌ను ఉద్దేశించి మాట్లాడినపుడు పిచ్చకుంట్ల అనే కులాన్ని దూషించినట్టు మాట్లాడటం తప్పే అన్నారు. వారికి క్షమాపణ చెప్తున్నానని తెలిపారు.