రాష్ట్ర చరిత్రలో రెవెన్యూ బిల్లు చిరస్థాయిగా నిలిచిపోతుంది

రాష్ట్ర చరిత్రలో  రెవెన్యూ బిల్లు చిరస్థాయిగా నిలిచిపోతుంది

వికారాబాద్ జిల్లా: ప్రభుత్వం తీసుకువచ్చిన రెవెన్యూ బిల్లు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. చారిత్రాత్మక రెవెన్యూ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా తాండూరు లో ట్రాక్టర్ లతో నిర్వహించిన‌ భారీ ర్యాలీ ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు,చైర్మన్ నాగేందర్ గౌడ్,స్థానిక ప్రజాప్రతినిధుల తో కలిసి మంత్రి సబిత రెడ్డి గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా రైతుల తరుపున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలువుతునట్లు మంత్రి సబితా పేర్కొన్నారు. దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని,రానున్న కాలంలో బిల్లు ఫలాలు ప్రజలు పొందుతారన్నారు. రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టి ,నేడు వ్యవస్థ లో మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. నేడు రైతన్నలు ,ప్రజలు గ్రామాల్లో తెలంగాణ వచ్చినపుడు సంతోష పడినట్లు ఉన్నారన్నారు. అందులో భాగంగానే ఊరూరా,వాడ వాడాలో ఎడ్ల బండ్ల,ట్రాక్టర్ ల ర్యాలీలు నిర్వహిస్తున్నారని అన్నారు.