మహిళలకు భరోసాగా సఖీ సెంటర్స్

మహిళలకు భరోసాగా సఖీ సెంటర్స్

మహిళలను వేధిస్తే కఠినచర్యలు తప్పవన్నారు.. మంత్రి సత్యవతి రాథోడ్. మహిళలను వేధిస్తే భయపడకుండా 100 లేదా, సఖీ సెంటర్ 181కి కాల్ చేయాలన్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో సఖీ సెంటర్ కు.. మంత్రి సత్యవతి రాథోడ్, నగర మేయర్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. పలు చోట్ల మహిళలు, బాలికలు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. అలాంటి బాధిత మహిళలకు మేమున్నామంటూ సఖీ కేంద్రాలు భరోసా ఇస్తున్నాయన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, అధికారులు పాల్గొన్నారు.