ప్రభుత్వ నిధులతో ఆశించిన ఫలితాలు రావు: మంత్రి తలసాని

ప్రభుత్వ నిధులతో ఆశించిన ఫలితాలు రావు: మంత్రి తలసాని

జీహెచ్ఎంసీ పరిధిలో పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్కుల నిర్వహణ బాధ్యతను స్థానిక యువకులకు అప్పగిస్తామన్నారు. మే 2వ తేదీ మంగళవారం సనత్ నగర్ లోని ఎస్ఆర్ టి నగర్ లో సుమారుగా రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన నెహ్రూ పార్కును ప్రారంభించిన మంత్రి తలసాని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని.. రాష్ట్ర ప్రభుత్వం పార్కులకు ప్రభుత్వం నిధులు కేటాయించిన మాత్రాన ఆశించిన మేర పలితాలు రావని.. వీటి నిర్వహణపై జీహెచ్ఎంసీతో పాటు స్థానికులు కూడా దృష్టి పెట్టి కాపాడుకోవాలన్నారు. సనత్ నగర్ డివిజన్లో 55 పార్కులు ఉన్నాయని.. ఈ డివిజన్ వాసులు ఎంతో అదృష్టవంతులని అన్నారు. నెహ్రు పార్క్ ను రూ.2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరిచామని తెలపారు. ఈ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి టెన్నిస్ కోర్టుతో సహా వాకింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని వెల్లడించారు. ఈ పార్కు బాధ్యత జీహెచ్ఎంసీతో పాటు స్థానికంగా యువకులకు అప్పగించినట్లు చెప్పారు మంత్రి తలసాని.