Barbie Telugu OTT: ఆస్కార్ గెలిచిన సూపర్ హిట్ మూవీ OTTకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Barbie Telugu OTT: ఆస్కార్ గెలిచిన సూపర్ హిట్ మూవీ OTTకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్ మూవీ బార్బీ(Barbie) సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్గ‌రేట్ రాబీ, రేయాన్ గ్లోసింగ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 128 మిలియన్ డాలర్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 1.446 బిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఆ ఇయర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది.

అందులో కేవలం ఇండియా నుండే రూ.150 కోట్లు రావడం గమనార్హం. ఇక ఇటీవల జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల్లో మొత్తం ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్ సాధించిన ఈ సినిమా.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కి గాను ఒక అవార్డును దక్కిచుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే ఓటీటీకి వచ్చేసింది. మొన్నటివరకు అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీలో అందుబాటులో ఉంది. కానీ, తాజాగా తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది ఈ మూవీ. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను జియో సినిమాస్ స్ట్రీమింగ్ చేస్తోంది. మే 4 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. వీలుంటే.. మీరు కూడా ఈ సూపర్ హిట్ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.