అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పార్టీ గళాన్ని వినిపిస్తాం

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పార్టీ గళాన్ని వినిపిస్తాం

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలలో ప్రజల సమస్యలపై తన పార్టీ గళాన్ని వినిపిస్తామన్నారు గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా రైతుల పంట పొలాలు నీట మునిగాయని…. వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. గోశామహల్ నియోజకవర్గం గన్ ఫౌండ్రిలో ఆదివారం బీజేపీ నాయకుడు ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్స్ కు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రాజా సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఆశ వర్కర్లను రాజా సింగ్ సన్మానించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆయన తెలిపారు.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు మాట్లాడేందుకు రెండు, మూడు నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తున్నారని…. సుమారు 15 అంశాలపై అసెంబ్లీలో మాట్లాడేందుకు తమకు ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. GHMC ఎన్నికల ప్రకటన రాకముందే టీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవాచేశారు. కరోనా నివరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని…. ప్రేవేట్ హాస్పిటల్స్ ప్రజలను దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని… రానున్న GHMC ఎన్నికల్లో ప్రజలే వారికి గుణపాఠం చెప్తారని రాజా సింగ్ స్పష్టంగా చేశారు.