మొబైల్‌ మసీదు.. ఒకేసారి 50 మంది ప్రార్థన చేయొచ్చు

మొబైల్‌ మసీదు.. ఒకేసారి 50 మంది ప్రార్థన చేయొచ్చు

టోక్యో: కరోనా వైరస్‌ ప్రభావం ఎలా ఉన్నా.. టోక్యో ఒలింపిక్స్‌ ఏర్పాట్ల  విషయంలో నిర్వాహకులు దూసుకెళ్తున్నారు. మెగా ఈవెంట్‌ కు వచ్చే ముస్లిం అథ్లెట్లు , కోచ్‌లు, సహాయక సిబ్బంది ప్రార్థనలు చేసుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మొబైల్‌ మసీదులను సిద్ధం చేస్తున్నారు. ట్రక్‌‌‌‌ వెనుక భాగంలోని కంటైనర్లలో ఒకేసారి 50 మంది ప్రార్థన చేసుకునే విధంగా డిజైన్‌ చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అథ్లెట్స్‌ విలేజ్‌ల్లో అన్ని మతాల వారు ప్రార్థనలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొన్ని క్రీడా ప్రాంగణాలతోపాటు హోటల్స్‌ లో ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు తగిన వసతులు లేవు. అలాంటి ప్రదేశాల్లో ఈ ట్రక్స్‌ ను ఉంచనున్నారు. జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఈ మొబైల్‌ మసీదులు టోక్యో వీధుల్లో ‌సంచరించనున్నాయి.