ప్లాస్టిక్‌‌ టెక్నాలజీపై శిక్షణ

ప్లాస్టిక్‌‌ టెక్నాలజీపై శిక్షణ

జ్యోతినగర్, వెలుగు:  ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లోని యువతకు మెషిన్ ఆపరేటర్, ప్లాస్టిక్‌‌ ప్రాసెసింగ్‌‌పై సెంట్రల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్‌‌ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ టెక్నాలజీ(సీపేట్‌‌) ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిక్షణను ఎన్టీపీసీ ఈడీ కేదార్‌‌‌‌రంజన్‌‌ పాండు మంగళవారం హైదరాబాద్‌‌ లో  ప్రారంభించారు. ఈ శిక్షణ ఆరు నెలల పాటు కొనసాగుతుందని, ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లోని నిరుద్యోగ యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపికైన స్టూడెంట్స్ కు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్నారు. ఎన్టీపీసీ ఏజీఎం హెచ్ ఆర్. బిజోయ్ కుమార్ సిగ్దర్, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.