బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డిప్యూటీ మేయర్ సునీల్ రావు

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డిప్యూటీ మేయర్ సునీల్ రావు

కరీంనగర్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో జిల్లాకు ఒకరి చొప్పున రాష్ట్ర అధికార ప్రతినిధులను నియమించగా.. కరీంనగర్ జిల్లా నుంచి సునీల్ రావుకు అవకాశం దక్కింది. తనకు అవకాశమిచ్చిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు సునీల్ రావు కృతజ్ఞతలు తెలిపారు.