రాజన్న సిరిసిల్ల,వెలుగు: జనగణన–2027ను పకడ్బందీగా పూర్తి చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సెన్సెస్ ఫర్ వెల్ఫేర్ పేరిట కలెక్టరేట్‌లో చార్జ్ ఆఫీసర్లు, అడిషనల్ ఆఫీసర్లకు రెండు రోజుల పాటు నిర్వహించనున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చార్జ్ ఆఫీసర్లుగా మున్సిపాలిటీలో కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లు, అదనపు చార్జ్ ఆఫీసర్లుగా ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారని వెల్లడించారు.
ఎన్యూమరేషన్ బ్లాక్ లో దాదాపు 700 నుంచి 800 మంది ప్రజలు ఉంటారని తెలిపారు. ఎన్యూమరేటర్, సూపర్ వైజర్లుగా టీచర్లను నియమించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీపీవో షరీఫ్‌ద్దీన్, పాల్గొన్నారు.
