దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్

దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం దర్శాల గుట్టపై ఉన్న దుర్వేషావలి దర్గాను మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే  కేటీఆర్‌‌‌‌ దర్శించుకున్నారు. మంగళవారం దర్గాలో షేక్ అజీజ్ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. కేటీఆర్​ దర్గాపై చాదర్ కప్పి పూలమాల వేశారు. ఆయనతోపాటు బీఆర్ఎస్‌‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, కృష్ణారెడ్డి, అందె సుభాష్, వాసరవేణి దేవరాజు, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.