వేములవాడ శివరాత్రి జాతరకు సీఎంకు ఆహ్వానం

వేములవాడ శివరాత్రి జాతరకు సీఎంకు ఆహ్వానం

వేములవాడ, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఈనెల 14, 15, 16 తేదీల్లో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు హాజరు కావాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లో మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌ హరీశ్‌‌‌‌, వేములవాడ ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు సీఎంను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.